సరైన సినిమా కోసం తారక రాముడు వెయిటింగ్, బొమ్మ పడితే పాన్ ఇండియా దద్దరిల్లాలి అంటోన్న ఫ్యాన్స్ !

నో డౌట్...ఆర్.ఆర్.ఆర్ తో ఎన్టీఆర్ ఇమేజ్ నెక్ట్స్ లెవల్‌కి చేరుతుంది. కేవలం టీజర్స్‌తోనే మనవాళ్ల స్థాయిలో ఏంటో శాంపిల్ చూపించారు రాజమౌళి.

  • Ram Naramaneni
  • Publish Date - 1:00 pm, Sat, 5 December 20
సరైన సినిమా కోసం తారక రాముడు వెయిటింగ్, బొమ్మ పడితే పాన్ ఇండియా దద్దరిల్లాలి అంటోన్న ఫ్యాన్స్ !

నో డౌట్…ఆర్.ఆర్.ఆర్ తో ఎన్టీఆర్ ఇమేజ్ నెక్ట్స్ లెవల్‌కి చేరుతుంది. కేవలం టీజర్స్‌తోనే మనవాళ్ల స్థాయిలో ఏంటో శాంపిల్ చూపించారు రాజమౌళి.  ఇప్పుడు నార్త్‌లో కూడా తారకరాముడి పేరు గట్టిగా వినిపిస్తోంది. తన నెక్స్ట్‌స్టెప్ పాన్ ఇండియాదే కావాలన్న కమిట్మెంట్ తో ఉన్న ఎన్టీయార్‌ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశారు ప్రశాంత్ నీల్. తనతో ప్లాన్ చేసిన లైన్‌ని ప్రభాస్‌కు ట్రాన్స్ ఫర్ చేశారు కేజీఎఫ్ డైరెక్టర్.  అరవింద సమేత తర్వాత త్రివిక్రమ్‌తో చెయ్యబోతున్న తారక్ 30వ మూవీకి కచ్చితంగా నేషనల్ రేంజ్ వస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. గురూజీ కూడా ఆ స్థాయిలో సైజ్ ఆఫ్ కాస్టింగ్‌ని సెట్ చేస్తున్నారు. కానీ.. ‘అల వైకుంఠపురములో’ మూవీ బన్నీకిచ్చినంత ఎలివేషన్ త్రివిక్రమ్‌కి ఇవ్వలేదు. ఆయనింకా నార్త్ సైడ్ ఎస్టాబ్లిష్ కాలేదన్నది వాస్తవం. మరి.. తారక్.. పాన్ ఇండియా డ్రీమ్స్ ఎలా నెరవేరుతాయి అన్నది ఆయన అభిమానులకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

శాండల్ వుడ్ లో ఇప్పటికే తగినంత ప్లేస్ వుంది ఎన్టీయార్‌కి. అక్కడి పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కోసం కన్నడ పాట పాడారు. రీసెంట్‌గా పునీత్ మూవీ యువరత్నను తెలుగులోకి వెల్ కమ్ చేశారు. కోలీవుడ్ సైడ్ కూడా తారక్ మీద ఇంట్రస్ట్ చూపే డైరెక్టర్లు చాలామందే వున్నారు. అట్లీ అయితే తాను ఎన్టీయార్‌కి రియల్ ఫ్యాన్ అని ఓపెన్‌గానే చెప్పుకున్నారు.  విజిల్ ఫేమ్ అట్లీ డైరెక్షన్లో ఎన్టీయార్ మూవీ ఉండబోతోందని ఏడాదిగా టాక్ నడుస్తోంది. సో.. కన్నడ డైరెక్టర్ మిస్సయితే అయ్యారు.. తమిళ్‌లో సత్తా చాటిన దర్శకులు కొందరు.. తారక్ కోసం కథలు రాసిపెట్టుకుని రెడీగా వున్నారన్నది నిజం. లేటెస్ట్ గా స్టాలిన్ డైరెక్టర్ మురుగదాస్.. ఎన్టీయార్ క్యాంపులో కనిపిస్తున్నారు. కోలీవుడ్ దళపతి విజయ్ తో ప్లాన్ చేసిన మూవీ కాన్సిల్ కావడంతో.. మురుగ నెక్స్ట్ ప్రాజెక్టు ఎన్టీయార్‌తోనేనన్న మాట వినిపిస్తోంది. త్రివిక్రమ్ తో సినిమా తర్వాత.. తారక్ చేయబోయేది అదే కావొచ్చు కూడా. సో.. యంగ్ టైగర్ పాన్ ఇండియా సినిమాకు రెడీ అయిపోండి.

 

Also Read :

Concussion Substitute : కంకషన్​ సబ్​స్టిట్యూట్​ అంటే ఏంటి? దాని కోసం రూపొందించిన నియమాలు ఏంటి?

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఇంట తీవ్ర విషాదం, ఎంపీకి ప్రముఖుల పరామర్శ

తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం, ఒకే మూవీలో పవర్ స్టార్, సూపర్ స్టార్, ఫ్యాన్స్‌కు పూనకాలే !