బిగ్‌బాస్ సీజన్ 4 ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఈసారి బిగ్‌బాస్ దత్తపుత్రక కోసం బలయ్యేది అతడేనా..
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4 ముగింపుకు ఇంకా కొన్ని రోజులే ఉండడంతో ఆట మరింత ఇంట్రెస్ట్‌గా మారింది. కానీ ఈ షో మొదటి నుంచి ఎలిమినేషన్ ప్రక్రియలో
Telugu Big Boss season 4: తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4 ముగింపుకు ఇంకా కొన్ని రోజులే ఉండడంతో ఆట మరింత ఇంట్రెస్ట్‌గా మారింది. కానీ మొదటి నుంచి ఈ షో ఎలిమినేషన్ ప్రక్రియలో ప్రేక్షకుల నుంచి విమర్శలను ఎదుర్కోంటునే ఉంది. ముఖ్యంగా బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేయడం అనేది ప్రేక్షకుల ఓటింగ్ పరంగానే సాగుతుందని తెలిసినా, ఈ సీజన్లో మాత్రం ఓటింగ్స్తో సంబంధం లేకుండా ఎలిమినేషన్స్ జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తుంది.
కాగా ఈ 13వ వారానికి వచ్చేసరికి హౌస్‌లో 7గురు సభ్యులు మాత్రమే మిగిలారు. అందులో అభిజిత్, హారిక, అవినాష్, అఖిల్, మోనాల్‌లు నామినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం అందరిలో ఉత్కంఠంగా మారింది. అయితే ఈసారి కూడా బిగ్‌బాస్ దత్తపుత్రిక.. అదేనండి ఆ గుజరాతీ భామా మోనాల్‌ను బిగ్‌బాస్ ఓట్లతో సంబంధం లేకుండా సేవ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా అసలు ఈ గుజరాతి అమ్మాయికి ప్రతిసారి సేవ్ అయ్యేంతలా ఎవరు ఓట్లు వేస్తున్నారనే సందేహం అందరిలోనూ ఉన్నదే.
ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న ఐదుగురిలో అభిజిత్, అఖిల్ సేవ్ జోన్లో ఉన్నారట. ఇంకా మిగిలిన ముగ్గురిలో మోనాల్‌కే తక్కువ ఓట్లు వచ్చాయని, కానీ ఆమెను కాకుండా బిగ్‌బాస్ అవినాష్‌ను ఎలిమినేట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. మరీ నిజంగానే మోనాల్ సేవ్ అయ్యిందా, అవినాష్‌ను ఎలిమినేట్ చేసారా అనే విషయాలు తెలుసుకోవాలంటే ఆదివారం వరకు వేచిచూడాల్సిందే.