నువ్వు స్టాండ్ తీసుకోవు.. నీ ప్రాబ్లం నాతో చెప్తావని చూస్తా.. ఆమె దగ్గర బాధపడిన అభిజిత్

టికేట్ టూ ఫీనాలే మెడల్ కోసం బిగ్‏బాస్ ఉయ్యాల టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే టి‏కేట్ టూ ఫీనాలే మెడల్ కోసం అఖిల్, సోహైల్ ఇద్దరు

నువ్వు స్టాండ్ తీసుకోవు.. నీ ప్రాబ్లం నాతో చెప్తావని చూస్తా.. ఆమె దగ్గర బాధపడిన అభిజిత్
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 05, 2020 | 11:39 AM

టికేట్ టూ ఫీనాలే మెడల్ కోసం బిగ్‏బాస్ ఉయ్యాల టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే టి‏కేట్ టూ ఫీనాలే మెడల్ కోసం అఖిల్, సోహైల్ ఇద్దరు చాలా గట్టి పోటీ ఇచ్చారు. ఉయ్యాలపై నుంచి దిగకుండా ఉగుతూ అలాగే ఉండిపోయారు. ఎంతకీ వీరిద్దరు ఉయ్యాల నుంచి దిగకపోవడంతో సంచలాకుడిగా వ్యవహరిస్తున్న అభి.. మీ ఇద్దరు ఒక నిర్ణయానికి రండి అని సలహ ఇచ్చాడు. దీంతో అఖిల్ వాళ్ళ అమ్మ సెంటిమెంట్‏ను వాడుకున్నాడు. అఖిల్ సెంటిమెంట్‏ వాడడంతో సొహైల్ బాగా ఎమోషనల్ అయ్యి ఉయ్యాల నుంచి కిందికి దిగేసాడు. దీంతో ఫీనాలే టికేట్ అఖిల్‍ను వరించింది.

అభిజిత్, హారిక మధ్య మళ్ళీ…

ఆ తర్వాత గార్డెన్ ఏరియాలో కూర్చోన్న అభిజిత్ దగ్గరకు వెళ్ళింది హారిక. ఏమైందో చెప్పు అభిజిత్.. నువ్వు చెప్తేనే కదా నాకు అర్థమౌతుంది అని హారిక అభిజిత్‏ను అడిగింది. నీకు తెలవంది ఏం కాదులే.. నేను నీ ఫ్రెండ్ గా చెప్తున్నా.. కొన్ని విషయాలను అర్థం చేసుకొని నీ ప్రాబ్లమ్ చెప్తావని చూస్తా.. కానీ నువ్వు స్టాండ్ తీసుకోవు అని బాధపడ్డాడు అభి. దీంతో హారిక “స్టాండ్ తీసుకోవడం అంటే ఏంటి అభి? ఒకే విషయాన్ని నువ్వు ఎందుకు పదే పదే ఆలోచిస్తూన్నావు, మర్చిపోవచ్చు కదా అని అనడంతో, మర్చిపో అంటున్నావు తప్పితే సహయం చేయడం నీ వల్ల కావడం లేదా? నువ్వు అర్థం చేసుకోవా? అని అభిజిత్ అనడంతో ఈ ఇద్దరి మధ్య చర్చ తారాస్థాయికి చేరింది. ఆ తర్వాత నాలుగో వారంలో అఖిల్ నన్ను ఏ రీజన్‏తో నామినేట్ చేశాడో తెలుసా? మొదటి వారంలో జరిగిన దాన్ని రీజన్ గా చూపి నామినేట్ చేశాడు. అయినా నన్ను అరేయ్ అని అన్నానని చెప్పాడు. ఆ తర్వాత అనలేదని.. మళ్ళీ నీ పర్మిషన్ తీసుకున్నా అని… అరేయ్ కాదు ఒరేయ్ అన్నాడు. అదే గొడవ మొన్న దోసే వేసే వరకు సాగుతూ వస్తుంది అని హారికతో చెప్పుకున్నాడు అభి. ఇంతలో అఖిల్ వచ్చి ” చాలా థాంక్స్ అభి.. నువ్వు లేకపోతే టాస్క్ ఇంతవరకు వచ్చేది కాదు” అని అభిని హగ్ చేసుకున్నాడు.