టికెట్ టు ఫినాలే మెడల్ సాధించిన అఖిల్… త్యాగం చేసిన సొహైల్… బెస్ట్, వరస్ట్ పెర్ఫామర్స్ ఎవరంటే…
బిగ్‌బాస్ సీజన్ 4.... 90వ ఎపిసోడ్ లో చాలా విషయాలు జరిగాయి. టికెట్ టు ఫినాలే మెడల్ రేస్, బీబీ 4 బెస్ట్ పెర్ఫామర్, వరస్ట్ పెర్ఫామర్, అభిజీత్, హారిక మధ్య గొడవ ఇలా చాలా కలిపి ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది.
బిగ్‌బాస్ సీజన్ 4…. 90వ ఎపిసోడ్ లో చాలా విషయాలు జరిగాయి. టికెట్ టు ఫినాలే మెడల్ రేస్, బీబీ 4 బెస్ట్ పెర్ఫామర్, వరస్ట్ పెర్ఫామర్, అభిజీత్, హారిక మధ్య గొడవ ఇలా చాలా కలిపి ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది.
అఖిల్ సోహైల్ ఫైట్…
అఖిల్-సొహైల్‌లు ఇద్దరూ టికెట్ టు ఫినాలే మెడల్ సాధించడం కోసం ధీటుగా పోరాడారు. ఉయ్యాలపై నుంచి దిగకుండా ఊగుతూ అలాగే ఉన్నారు. చలి, ఎండ అన్నింటినీ తట్టుకుని ఉయ్యాల దిగకుండా ఉండేందుకు ఉడుం పట్టు పట్టారు. టాస్క్ చేస్తున్న ఇంటి సభ్యులను అలరించేందుకు అవినాష్, అరియానాలు ‘ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ’ అంటూ పాట అందుకుని ప్రేక్షకుల చెవులకు చిల్లులు పడేలా చేశారు. అఖిల్-సొహైల్‌లతో పాటు సంచాలకుడిగా ఉన్న అభిజిత్ సైతం ఆటను గమనిస్తూ బయటే కూర్చుండిపోయాడు. కాగా, చాలా నాటకీయంగా జరిగిన పరిణామాల అనంతరం సొహైల్ మెడల్ ను త్యాగం చేశారు.
అందరూ ఏడ్చారు…
సొహైల్ అఖిల్ కోసం త్యాగం చేసి బలవంతంగా ఉయ్యాల దిగిపోయాడు. దీంతో సొహైల్ చేసిన త్యాగానికి అఖిల్ బోరు బోరున ఏడ్చాడు. అభిజిత్ దగ్గర బోరు బోరున విలపించారు ఇద్దరూ. మొత్తానికి సొహైల్ చేసిన త్యాగంతో అఖిల్ టికెట్ టు ఫినాలే మెడల్ సాధించి టాప్ 5కి వెళ్లాడు. అయితే హారిక, అభిజీత్ మధ్య మళ్లీ చిన్న వాగ్వాదం జరిగింది. ఇక డేర్ టు టాస్క్‌లో అభిజిత్ తన గర్ల్ ఫ్రెండ్ లిస్ట్ బయటపెట్టాడు. అవినాష్ అయితే ఇంటి సభ్యులు ఒక్కొక్కరిగురించి అద్భుతంగా బుర్ర కథ రూపంలో చెప్తూ తన టాలెంట్‌ని బయటపెట్టాడు. సుమారు 20 నిమిషాల పాటు అనర్గళంగా మాట్లాడుతూ బిగ్ బాస్‌కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాడు అవినాష్. అనంతరం ఇంటి సభ్యులంతా కలిసి ఫ్యామిలీ హగ్ ఇచ్చుకోవడంతో చాలా రోజుల తరువాత బిగ్ బాస్ హౌస్‌లో ఆరోగ్యవంతమైన వాతావరణం కనిపించింది.
బెస్ట్, వరస్ట్ పెర్ఫామర్స్….
ఇంటి సభ్యులకు బిగ్ బాస్ 90వ రోజున మరో టాస్క్ ఇచ్చాడు. ఇప్పటివరకూ మీ పర్ఫామెన్స్‌ని పరిగణలోకి తీసుకుని ఈ ఇంట్లో ఏ ర్యాంక్‌కి ఎవరు సరిపోతారని అనుకుంటున్నారో.. ఆ ర్యాంక్‌కి మీరే ఎందుకు అర్హులో చెప్తూ పోరాడాల్సి ఉంటుందని.. ఈ చర్చల్లో ఫైనల్ ర్యాంక్‌లను బిగ్ బాస్‌కి తెలియజేయాల్సి ఉంటుందని అన్నారు. ఫస్ట్ ర్యాంక్ మీద నిలబడిన సభ్యుడు బెస్ట్ పెర్ఫామర్ ఆఫ్ ది సీజన్‌గా పరిగణించబడతాడు. ర్యాంక్ 6 మీద నిలబడిన సభ్యుడు వరస్ట్ పెర్ఫామర్ ఆఫ్ ది సీజన్‌గా పరిగణించబడతారని చెప్పారు బిగ్ బాస్ తెలిపారు. అయితే ఒక ర్యాంక్ మీద ఒక సభ్యుడు మాత్రమే ఉండాలని కండిషన్ పెట్టారు బిగ్ బాస్. అఖిల్ ఇప్పటికే ఫినాలే మెడల్ పొంది ఫైనలిస్ట్ అయిన కారణంగా ఈ ప్రక్రియలో పాల్గొనాల్సిన అవసరం లేదని చెప్పారు బిగ్ బాస్.
అయితే, బజర్ మోగగానే సొహైల్ నెంబర్ 1 స్థానంలో నిలబడగా.. అరియానా నెంబర్ 2, హారిక నెంబర్ 3, మోనాల్ నెంబర్ 4 స్థానాల్లో నిలబడ్డారు. అయితే, అభిజిత్ ఐదో స్థానంలో అవినాష్‌ని నిలబెట్టి మరీ చివరి స్థానంలో 6లో నిలబడ్డాడు. మిగిలిన ఇంటి సభ్యులు తమ తమ స్థానాల కోసం పోటీ పడితే అభిజిత్ మాత్రం.. తనకు ఆరో స్థానమే కావాలని చెప్పాడు. అనంతరం బిగ్ బాస్ బెస్ట్ పెర్ఫామర్గా సొహైల్ ను, వరస్ట్ పెర్ఫామర్గా అభిజిత్ ను డిసైడ్ చేశాడు. తక్షణమే అభిజిత్‌ని జైలులోకి వెళ్లాలని ఆదేశించారు బిగ్ బాస్. దీంతో బోరు బోరున ఏడ్చింది హారిక.. వెంటనే అభిజిత్‌ని హగ్ చేసుకుని ఏడ్చేసింది.
అభిజిత్ నెంబర్ 6లో నిలబడటంతో తన గేమ్ స్ట్రాటజీ ఉపయోగించినట్టుగా అనిపిస్తోంది. మరోసారి స్మార్ట్ గేమ్ ప్లే చేశాడు. సీజన్ మొత్తం బాగా ఆడి వరస్ట్ పెర్ఫామర్ అనిపించుకుంటే.. ప్రేక్షకుల్లో సింపథీ పెరిగే అవకాశం ఉండనే ఉంది. మొత్తంగా నేటి ఎపిసోడ్‌లో అఖిల్ టికెట్ టు ఫినాలే గెలవడం.. సొహైల్ త్యాగం చేయడం.. అవినాష్ అద్భుతంగా ఇంటి సభ్యుల గురించి బుర్రకథ చెప్పడం.. అభిజిత్ తనని తాను వరస్ట్ పెర్ఫామర్ అని ప్రకటించుకోవడం హైలైట్ అయ్యాయి.