RRR Movie: మరో 50 రోజుల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా.. కౌంట్‌డౌన్‌ స్టార్ట్ అంటూ కొత్త పోస్టర్‌ ను రిలీజ్‌ చేసిన జక్కన్న టీం..

టాలీవుడ్‌ తో పాటు యావత్‌ భారతీయ సినిమా పరిశ్రమ వేయికళ్లతో ఆసక్తిగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR).

RRR Movie: మరో 50 రోజుల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా.. కౌంట్‌డౌన్‌ స్టార్ట్ అంటూ కొత్త పోస్టర్‌ ను రిలీజ్‌ చేసిన జక్కన్న టీం..
Follow us
Basha Shek

|

Updated on: Feb 03, 2022 | 5:58 PM

టాలీవుడ్‌ తో పాటు యావత్‌ భారతీయ సినిమా పరిశ్రమ వేయికళ్లతో ఆసక్తిగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR). దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ పాన్‌ ఇండియా సినిమాలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ramcharan), యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ (NTR) హీరోలుగా నటిస్తున్నారు. అలియాభట్‌, ఓలివియో మోరీస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియాశరణ్‌, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెత్‌ ఓ రూపొందిన ఈ సినిమా కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ కారణంగా మరొకసారి వెనక్కు తగ్గింది. ఆతర్వాత కొన్ని రోజులకు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను మార్చి 18 లేదా ఏప్రిల్‌ 28న విడుదల చేస్తామని ప్రకటించింది. తాజాగా ఈ రెండు రోజులు కాకుండా సినిమాను మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

గుర్రంపై రామరాజు.. బుల్లెట్‌ పై భీమ్‌..

కాగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదలకు మరో 50 రోజులు మాత్రమే మిగిలివుంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ జక్కన్న బృందం సినిమా కొత్త పోస్టర్‌ ను రిలీజ్‌ చేసింది. ఇందులో రామరాజు పాత్రలో రామ్‌ చరణ్‌ గుర్రంపై స్వారీ చేస్తుండగా.. అతని వెనకే ఎన్టీఆర్ బైక్ పై వెళుతున్నాడు. సినిమాకు కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ అయినట్లు రీలీజ్‌ చేసిన ఈ పోస్టర్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా సినిమాకు సంబంధించిన ట్రైలర్ అన్ని భాషల్లోనూ 150 మిలియన్ల వ్యూస్‌ ను క్రాస్ చేయడం విశేషం.

Also Read:Allu Arjun: పునీత్‌ రాజ్‌కుమార్‌ కు నివాళి అర్పించిన అల్లు అర్జున్.. కుటుంబ సభ్యులకు పరామర్శ..

Mahaan Trailer: అదరగొట్టిన తండ్రీకొడుకులు.. విక్రమ్‌ ‘మహాన్‌’ ట్రైలర్‌ వచ్చేసింది!

Allu Arjun: పుష్పతో అంతకంతకూ పెరుగుతోన్న బన్నీ పాపులారిటీ.. ఆ విషయంలో రజనీని అధిగమించిన అల్లు అర్జున్‌..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి