రవితేజ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది.. ‘ఖిలాడి’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్.. నయా లుక్‌లో అదరగొడుతున్న మాస్ రాజా..
'క్రాక్' సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు మాస్ మాహారాజా రవితేజ. ఇక అదే జోరుతో తన తదుపరి సినిమాలను కూడా వీలైనంత
‘క్రాక్’ సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు మాస్ మాహారాజా రవితేజ. ఇక అదే జోరుతో తన తదుపరి సినిమాలను కూడా వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు మాస్ రాజా. ప్రస్తుతం రవితేజ, రమేష్ వర్మ డైరెక్షన్లో ‘ఖిలాడి’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ షూటింగ్లో పాల్గొన్నాడు రవితేజ. ఇక మంగళవారం రవితేజ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ అందించింది చిత్రయూనిట్.
మంగళవారం రవితేజ పుట్టిన రోజు సందర్భంగా.. ఖిలాడి ఫస్ట్ గింప్స్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఇందులో మాస్ మాహారాజా నయా లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇక ఈ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తోనే సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేశారు. ఇందులో రవితేజ డ్యూయోల్ రోల్లో నటించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రవితేజకు జోడిగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక సమ్మర్లో ఈ సినిమా విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది.
The MASS & SWAG Personified @RaviTeja_offl ?
Feel The KICK-ASS BGM ??? & the GRANDEUR of #Khiladi ?️ ▶ https://t.co/Ftf9eoYT0a#KhiladiFirstGlimpse@DirRameshVarma @ThisIsDSP @sagar_singer @idhavish #KoneruSatyanarayana #AStudiosLLP @PenMovies#HappyBirthdayRAVITEJA ? pic.twitter.com/u1f9Vp0542
— BARaju (@baraju_SuperHit) January 26, 2021