AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Story: 2013లోనే మా ప్రేమ కథ మొదలైంది.. పెళ్లి వేడుకలో రివీల్ చేసిన స్టార్ హీరో!

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ ప్రేమ కథ ఉంటుంది. అయితే, దానిని వాళ్లు ఎవరికీ చెప్పరు. చాలా అరుదైన సందర్భాలలో మాత్రమే రివీల్ చేస్తుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలు వాళ్ల ప్రేమ విషయాలను బయటికి చెప్పుకునేందుకు ఇష్టపడరు. కానీ, ఈ స్టార్ హీరో మాత్రం తన లవ్ స్టోరీ ..

Love Story: 2013లోనే మా ప్రేమ కథ మొదలైంది.. పెళ్లి వేడుకలో రివీల్ చేసిన స్టార్ హీరో!
Couple
Nikhil
|

Updated on: Nov 24, 2025 | 7:30 AM

Share

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ ప్రేమ కథ ఉంటుంది. అయితే, దానిని వాళ్లు ఎవరికీ చెప్పరు. చాలా అరుదైన సందర్భాలలో మాత్రమే రివీల్ చేస్తుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలు వాళ్ల ప్రేమ విషయాలను బయటికి చెప్పుకునేందుకు ఇష్టపడరు. కానీ, ఈ స్టార్ హీరో మాత్రం తన లవ్ స్టోరీ ఎక్కడ, ఎలా మొదలైందో చెప్పేశాడు.

బాలీవుడ్‌లో పాపులర్​ ప్రేమ జంటల్లో ఒకటి రణ్​వీర్​ సింగ్​-దీపికా పదుకొణె. ఆరేళ్లు ప్రేమలో ఉన్న ఈ జంట 2018లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 2024లో వీరికి ఓ కూతురు కూడా జన్మించింది. మోడల్​గా కెరీర్​ ప్రారంభించిన దీపిక బాలీవుడ్​లో స్టార్​ హీరోయిన్​గా ఎదిగింది. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో రాణిస్తున్న దీపిక, ప్రభాస్​ సరసన ‘కల్కి’ సినిమాతో టాలీవుడ్​లోనూ అడుగుపెట్టింది.

అయితే రణ్​వీర్​ సింగ్​, దీపికా పదుకొణె ప్రేమకథ ఎలా మొదలైంది? అనేది ఇప్పటికీ అభిమానులు ఆసక్తిగా వెతుకుతున్న ప్రశ్న. తాజాగా రణ్​వీర్​ స్వయంగా తమ ప్రేమకథను పంచుకున్నారు. తమ ప్రేమ ఎలా మొదలైంది, ఎవరు మొదటగా ప్రేమను ప్రకటించారు అనే విషయాలను చెప్పుకొచ్చారు.

‘రామ్​లీలా’ షూటింగ్​లోనే..

రణ్​వీర్​ సింగ్​ కంటే ముందు దీపిక పలువురిని ప్రేమించి విఫలమైంది. ఆ బాధను తట్టుకోలేక ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తనే స్వయంగా చెప్పింది. అయితే 2013లో రణ్​వీర్​ సింగ్​, దీపికా పదుకొణె జంటగా ‘రామ్​ లీలా’ సినిమాలో నటించారు. సంజయ్​ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గుజరాత్​లో జరిగే రామ్​ లీలా పండుగ నేపథ్యంలో రొమాంటిక్​ డ్రామాగా రూపొందింది. రణ్​వీర్​ రామ్​ పాత్రలో, దీపిక లీలా పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద బ్లాక్​బస్టర్​ హిట్​గా నిలిచింది. అయితే ఈ సినిమా షూటింగ్​ టైమ్​లోనే తమ మధ్య ప్రేమ పుట్టిందని అంటున్నారు రణ్​వీర్​.

Ranvir And Deepika

Ranvir And Deepika

ఇటీవల న్యూయార్క్‌లోని యుఎస్ బిలియనీర్ పద్మజా, రామ రాజు మంటెనా కుమార్తె నేత్ర మంటెనా సంగీత్ వివాహ సందర్భంగా రణ్​వీర్ తమ ప్రేమకథను పంచుకున్నారు. ‘ఉదయ్‌పూర్ లవ్ స్టోరీలకు లక్ష్మి స్వరూపం! ఇక్కడే ‘రామ్ లీలా’ షూటింగ్ జరిగింది. మీ బాబీతో కలిసి నటించాను. ఆ ఉదయ్‌పూర్ షెడ్యూల్‌లోనే మా ప్రేమకథ మొదలైంది. ఉదయ్​పూర్​ లక్ష్మి స్వరూపం. నాకు లక్షిలాంటి భార్యను ఇచ్చింది’ అంటూ తమ ప్రేమ చిగురించిన రోజులను గుర్తుచేసుకున్నారు రణ్​వీర్​.

‘రామ్ లీలా’ తర్వాత ‘బాజీరావ్ మస్తానీ’ (2015), ‘పద్మావత్’ (2018) సినిమాల్లోనూ ఇద్దరూ కలిసి నటించారు. ఈ సినిమాలు, భన్సాలీ మ్యాజిక్‌తో వారి కెమిస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా చూపించాయి. 2018 నవంబర్ 14న ఇటలీలోని లేక్ కోమోలో వివాహం చేసుకున్నారు. 2024 సెప్టెంబర్‌లో వారికి కుమార్తె దువా పదుకోన్ సింగ్ జన్మించింది. ఈ ఏడాది దీపావళి సందర్భంగా దువా ముఖాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. పెళ్లి తర్వాత కూడా రణ్​వీర్​, దీపిక ఇద్దరూ కెరీర్​ పరంగా బిజీగా ఉన్నారు. మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే చూద్దామని అభిమానులూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు!

Follow Us