MaheshBabu: బుద్ధుడి విగ్రహం, ఫ్యామిలీ ఫోటో.. మహేష్‌బాబు ఇంట్లో ఇంటీరియర్ డెకరేషన్ వీడియో
ప్రిన్స్ మహేష్‌బాబు.. ఆయనకు సంబంధించిన ఏ విషయం బయటకు వచ్చినా తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులే కాదు. సినీ ప్రేమికులు, అమ్మాయిలు ఆసక్తిగా తెలుసుకుంటారు. సింపుల్‌గా కనిపించే సూపర్ స్టార్ సినిమాలకు సంబంధించిన విషయాలనే ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటారు. కుటుంబ వ్యవహారాలను పరిమితంగానే బయటకు చెబుతుంటారు.

ఇటీవల ఓ ఇంటీరియర్ డిజైనర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రీల్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. హైదరాబాద్ జూబిలీ హిల్స్‌లోని ఓ ఇంట్లోకి తీసుకెళ్తూ, ‘ఈ ఇంట్లో ఫ్లవర్స్ అరేంజ్ చేస్తున్నాను’ అని క్యాప్షన్ పెట్టి వీడియో షేర్ చేశారు. కానీ ఆ వీడియోలో కనిపించిన గోల్డెన్ బుద్ధా స్టాచ్యూ, న్యూట్రల్ టోన్స్‌తో కూడిన లివింగ్ ఏరియా, గోల్డ్ ఫ్రేమ్డ్ ఫ్యామిలీ ఫోటోలు… ఇవన్నీ చూస్తే ఇది సామాన్య ఇల్లు కాదని తెలుస్తోంది. ఇది ఒక స్టార్ హీరో ఇల్లు!
అదిరిపోయే ఇంటీరియర్..
ప్రవేశ ద్వారం నుంచే మనసు ఆకట్టుకునే వైభవం. స్టోన్ టైల్స్ మీద అడుగుపెడితే చల్లని ఫీల్, పక్కనే గ్రీనరీతో నిండిన చిన్న గార్డెన్. గేట్ పక్కన గోల్డ్ లెటరింగ్‌లో ఫ్యామిలీ పేరు… అది కూడా గోల్డ్ షీన్‌తో మెరిసిపోతుంది. లోపలికి అడుగుపెడితే లివింగ్ రూమ్‌లో క్రీమ్-గ్రే సోఫాలు, చెకర్డ్ సెంటర్ టేబుల్, భారీ గోల్డ్ ఫ్రేమ్డ్ మిర్రర్. గోడ మీద రంగురంగుల పెయింటింగ్స్, క్రిస్టల్ షాండెలియర్ కింద నుంచి వచ్చే సాఫ్ట్ లైట్… ఇవన్నీ కలిసి ఒక రాయల్టీ ఫీల్ ఇస్తాయి, అయినా ఎక్కడా ఓవర్ లగ్జరీ అనిపించదు. సింపుల్, ఎలిగెంట్, కోజీ.
అవుట్‌డోర్ సీటింగ్ ఏరియా మరింత ఆహ్లాదకరంగా ఉంది. గ్రే కుషన్స్, కాఫీ టేబుల్, చుట్టూ గ్రాస్… అక్కడ కూర్చుంటే సాయంత్రం కాఫీ తాగుతూ గడపాలనిపిస్తుంది. కానీ ఆ వీడియోలో అందరి దృష్టిని ఆకర్షించింది మరో కార్నర్ మారూన్ వాల్ ముందు గోల్డెన్ బుద్ధా స్టాచ్యూ, పక్కన చిన్న టేబుల్ మీద మరో బుద్ధ ఫిగరిన్. దాని చుట్టూ ఫ్రెష్ వైట్ ఫ్లవర్స్… ఆ ఒక్క కార్నర్ చూస్తేనే మనసుకి ప్రశాంతత వచ్చినట్టు ఉంటుంది. ఈ ఇంటి యజమానులు లగ్జరీతో పాటు ఆధ్యాత్మికతను కూడా ఎంత అందంగా మేళవిస్తున్నారో అర్థమవుతుంది.
View this post on Instagram
ఇంకా గోడల మీద ఫ్యామిలీ ఫోటోలు… నలుగురూ కలిసి నవ్వుతూ తీసిన పిక్చర్స్, గోల్డ్ ఫ్రేమ్స్‌లో ఒక్కొక్కటిగా అలంకరించి పెట్టారు. ఇంటి పేరు, బుద్ధా కార్నర్, గోల్డ్ టచ్‌లు, న్యూట్రల్ డెకర్… ఇవన్నీ చూస్తుంటే ఈ ఇల్లు తెలుగు సినీ అభిమానులకు బాగా తెలిసినదేననిపిస్తుంది కదా? అవును… ఈ ఇల్లు సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోధ్కర్ దంపతులది! ప్రస్తుతం మహేష్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘వారణాసి’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఓ ఈవెంట్ నిర్వహించి టైటిల్ రివీల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఇంతకాలం ఫ్యాన్స్ ఊహించుకున్న ఆ లగ్జరీ లైఫ్‌స్టైల్‌కి ఒక చిన్న గ్లింప్స్ ఈ వీడియో… మళ్లీ మళ్లీ చూస్తూ ‘ఇదే మన ప్రిన్స్ ఇల్లు’ అని గర్వపడుతున్నారు. గోల్డ్ టచ్‌లతో మెరిసే బుద్ధా కార్నర్ నుంచి ఫ్యామిలీ ఫోటోల వరకు… ప్రతి మూలా మహేష్ సరళత, నమ్రత అభిరుచి, ఇద్దరి ప్రేమను చాటుతుంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు ఇల్లు ఎలా ఉందో మీరూ ఓసారి చూసేయండి!
