RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చెర్రీ.. ఏమన్నారంటే..
RRR Movie: ఈ సంకాంత్రికి ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కానుందని అటు రామ్ చరణ్ ఫ్యాన్స్, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ మాటకొస్తే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ..

RRR Movie: ఈ సంకాంత్రికి ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కానుందని అటు రామ్ చరణ్ ఫ్యాన్స్, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ మాటకొస్తే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూసింది. అయితే అందరి ఆశలపై నీళ్లు చల్లుతూ మేకర్స్ ఈ సినిమా విడుదలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడం, పలు రాష్ట్రాల్లో ఆంక్షలు అమల్లోకి రావడంతో ఆర్ఆర్ఆర్‌ను వాయిదా వేయలేని పరిస్థితి వచ్చింది.
అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుంది.? సమ్మర్‌కు సందడి చేయనుందా.? ఈ విషయంపై మాత్రం ఇప్పటి వరకు చిత్ర యూనిట్ ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ వాయిదాపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన రౌడీబాయ్స్ మ్యూజికల్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన రామ్ చరణ్.. మాట్లాడుతూ.. సంక్రాంతికి మా సినిమా రాకపోయిన మాకు బాధ లేదని.. ఎందుకంటే, సరైన సమయంలోనే ఆ సినిమా రావాలని చెప్పుకొచ్చారు.
ఇక ఆర్ఆర్ఆర్ కోసం మూడున్నరేళ్లు కష్టపడ్డామని చెప్పిన చెర్రీ, సినిమా విడుదల ఎప్పుడనేది డైరెక్టర్ రాజమౌళి, నిర్మాత దానయ్య నిర్ణయిస్తారని తెలిపారు. ఇదిలా ఉంటే వినయ విధేయ రామ తర్వాత మరో చిత్రంలో కనిపించని రామ్ చరణ్ త్వరలో ఆచార్యతో ఫ్యాన్స్‌ను పలకరించనున్నాడు. ఇక వీటితో పాటు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా, గౌతమ్ దర్శకత్వంలో మరో సినిమాను లైన్‌లో పెట్టారు చెర్రీ. అంతేకాకుండా సుకుమార్‌తో పాటు మరికొంత మంది దర్శకులు చెర్రీతో సినిమా చేయడానికి ప్రిపేర్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: కారు కొనుగోలు చేసేవారికి మారుతి సుజుకీ బంపర్ ఆఫర్
Winter Tips: చలికాలంలో బద్దకం వీడి ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తప్పక పాటించాల్సిందే..
CM KCR: ఎరువుల ధరలు తగ్గించండి.. ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ బహిరంగ లేఖ..