AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: ఎరువుల ధరలు తగ్గించండి.. ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ బహిరంగ లేఖ..

ఎరువుల ధరల పెంపుపై తన నిరసన వ్యక్తం చేస్తూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ బుధ‌వారం బహిరంగ లేఖ రాశారు. పెరిగిన ఎరువుల ధ‌ర‌లు త‌గ్గించాల‌ని, కోట్ల..

CM KCR: ఎరువుల ధరలు తగ్గించండి.. ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ బహిరంగ లేఖ..
Cm Kcr
Sanjay Kasula
|

Updated on: Jan 12, 2022 | 7:38 PM

Share

ఎరువుల ధరల పెంపుపై తన నిరసన వ్యక్తం చేస్తూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ బుధ‌వారం బహిరంగ లేఖ రాశారు. పెరిగిన ఎరువుల ధ‌ర‌లు త‌గ్గించాల‌ని, కోట్ల మంది రైతుల త‌ర‌పున విజ్ఞ‌ప్తి చేస్తున్నాన‌ని సీఎం కేసీఆర్ త‌న లేఖ‌లో పేర్కొన్నారు. 2022 వ‌ర‌కు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామ‌ని 2016లో ప్ర‌క‌టించారని గుర్తు చేశారు. ఇంత వ‌ర‌కు అతీగ‌తీ లేదంటూ లేఖలో ధ్వజమెత్తారు. దేశ రైతాంగం ఇప్ప‌టికే తీవ్ర న‌ష్టాల్లో ఉంద‌న్నారు. ఎరువుల ధ‌ర‌లు 50 నుంచి 100 శాతం పెరిగాయి. గ‌త 90 రోజులుగా ఎరువుల ధ‌ర‌లు విప‌రీతంగా పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే అనేక రైతు వ్య‌తిరేక నిర్ణ‌యాలు తీసుకున్నారు. వ్య‌వ‌సాయాన్ని కార్పొరేట్ శ‌క్తుల‌కు క‌ట్ట‌బెట్టేందుకు కుట్ర‌లు చేస్తున్నారు.

గ‌త ఐదేండ్ల‌లో ఇన్‌పుట్ కాస్ట్ రెట్టింపు అయింద‌న్నారు. గుడ్డిగా కేంద్రం ఎరువుల ధ‌ర‌ల‌ను పెంచుతోంది. యూరియా, డీఏపీ వినియోగం త‌గ్గించాల‌ని రాష్ట్రాల‌కు చెబుతున్నారు. ఎరువుల ధ‌ర‌లు త‌గ్గించ‌క‌పోగా, ఆ భారాన్ని రైతుల‌పై నెడుతున్నారు. దేశంలోని కోట్లాది రైతుల ప‌క్షాన చెబుతున్నా.. ఎరువులు స‌బ్సిడీపై ఇవ్వాలి. రైతుల పెట్టుబ‌డి మొత్తాన్ని త‌గ్గించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

కేంద్రం చ‌ర్య‌ల‌తో రైతులు ఆందోళ‌న చెందుతున్నారు. ఎరువుల స‌బ్సిడీ విధానాన్ని రైతుల ప్ర‌యోజ‌నాల‌కు విరుద్ధంగా మార్చారు. 70 ఏండ్లుగా ఎరువుల‌పై స‌బ్సిడీ కొన‌సాగుతోంది. న‌రేగాతో వ్య‌వ‌సాయాన్ని అనుసంధానం చేయాల‌ని తెలంగాణ తీర్మానం చేసి పంపింది. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పంద‌న లేదు అని కేసీఆర్ పేర్కొన్నారు.

కరెంటు మోటార్లు బిగించి బిల్లులు వసూలు చేయడం, ఎన్‌ఆర్‌జీఈ ని వ్యవసాయానికి అనుసంధానం చేయమంటే చేయకుండా నాన్చడం, విపరీతంగా ఎరువుల ధరలు పెంచడం, రైతులు తాము పండించిన ధాన్యాన్ని కూడా కొనకుండా దుర్మార్గపు చర్యలకు పూనుకోవడం వెనక భారీ కుట్ర దాగి వుందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రైతులను వారి పొలాల్లో వారినే కూలీలుగా మార్చే కుట్రలను ఎదుర్కోవాలని రైతాంగానికి పిలుపునిచ్చారు.

గ్రామీణ వ్యవసాయ రంగాన్ని, అనుబంధ వృత్తులను నిర్వీర్యం చేసి, గ్రామీణ ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేసి వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్న బీజేపీని కూకటివేళ్లతో పెకలించి వేయాలని దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి: Viral Video: కర్మ ఫలాం ఎలా ఉంటుందో తెలుసా.. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..

Viral Video: పక్షులు అత్యవసర మీటింగ్‌లో ఉన్నాయి.. ఏ అంశంపై డిస్కషన్ చేస్తున్నాయో చెప్పుకోండి చూద్దాం..