AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కర్మ ఫలాం ఎలా ఉంటుందో తెలుసా.. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..

మనం చేసిన కర్మలకి అనుభవించే ఫలితాన్ని కర్మ ఫలం అంటారు. దేవుడు కేవలం కర్మ ఫలాన్ని మాత్రమే నిర్ణయిస్తాడు. మనము చేసే ప్రతి కర్మకు ఫలితమనేది ఉంటుంది. అది కూడా ఇక్కడే అనుభవించాలి..

Viral Video: కర్మ ఫలాం ఎలా ఉంటుందో తెలుసా.. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..
Boy Playing Basketball Funny Video
Sanjay Kasula
|

Updated on: Jan 12, 2022 | 4:21 PM

Share

సాధారణంగా ప్రతి ఒక్కరూ కర్మ పలాలను ఏదో ఒక రోజు అనుభవించాలని చెబుతారు. ఎవరైనా తప్పు చేస్తే ఆ ఫలితం ఎప్పటికైనా అనుభవించవలసి ఉంటుంది. అయితే, తప్పుడు పనులకు వెంటనే ఫలితం చూపిస్తాయి కూడా మనం విని ఉంటాం . ఇలాంటి వీడియోలు చాలా తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఇది చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ రోజుల్లో అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందులో ఒక పిల్లవాడు తన కర్మ ఫలాలను పొందే విధానాన్ని చూస్తే మీరు కూడా నవ్వుతారు.

తన కోపమే తన శత్రువు..

వైరల్ వీడియోలో మీరు బాస్కెట్‌బాల్ ఆడుతున్న ఓ బాలుడిని చూడవచ్చు. దూరం నుండి పరుగున వచ్చి బంతిని బాస్కెట్‌లో వేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ బాల్ బాస్కెట్‌లోకి వేయలేక పోతాడు. దీని తర్వాత అతను లేచి నిలబడి బంతిని మరోసారి బాస్కెట్‌లో వేయడానికి ప్రయత్నించాడు. కానీ ఈసారి కూడా అతను విఫలమయ్యాడు.

వీడియో చూడండి..

బుట్ట స్తంభం నుండి జారిపోయినప్పటికీ.. బాలుడు దానిలోకి బంతిని విసిరాడు.. కానీ చివరి సారి విసిగిపోయేసారికి అతనికి కోపం తెప్పిస్తుంది. బుట్ట స్తంభంపై తన కోపాన్ని వెళ్లగక్కాడు. అతను బాస్కెట్  స్తంభంపై గట్టిగా తన్నాడు. కానీ స్తంభం చాలా అలానే ఉంది. అది బాస్కెట్  స్తంభాన్ని కొట్టిన తర్వాత బాలుడి ముఖానికి తగిలింది.. ఆ తర్వాత అతను అక్కడే పడిపోయాడు.

ఈ ఫన్నీ వీడియోను ఐపిఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విట్టర్ ఖాతా నుండి పంచుకున్నారు. ” టార్గెట్ సులభంగా సాధించినప్పుడు.. ఇలానే ఉంటుంది” అనే క్యాప్షన్‌ జోడించాడు. ఈ వీడియోను వినియోగదారులు.. దానిపై షేర్ చేస్తున్నారు.