Viral Video: వేగంగా దూసుకొస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు.. పట్టాలపై గజరాజు.. చివరకు ఏం జరిగిందంటే..?
అటవీ ప్రాంతాల్లో ఏనుగులు పట్టాలపైకి రావడం తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దేశంలో నిత్యం ఏదో ఒకచోట అలా రైలు ఢీకొని ఏనుగులు మరణిస్తూనే ఉన్నాయి.
అటవీ ప్రాంతాల్లో ఏనుగులు(Elephants) రైలు పట్టాలపైకి రావడం తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దేశంలో నిత్యం ఏదో ఒకచోట అలా రైలు ఢీకొని ఏనుగులు మరణిస్తూనే ఉన్నాయి. రైలు పట్టాలపై నిల్చొన్న ఏనుగు గుంపుపై రైలు దూసుకెళ్లడంతో పదుల సంఖ్యలో అవి మరణించిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. దీంతో అటవీ ప్రాంతాల్లో రైళ్లు అతి వేగంగా వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని జంతు ప్రియులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్(West Bengal)లో మహానంద ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఓ ఏనుగు ప్రాణాలతో బయటపడింది. రైలు(Train) వేగంగా వెళ్తుండగా.. పట్టాలపై ఓ ఏనుగు నిల్చుని ఉండటాన్ని దాని డ్రైవర్ గమనించాడు. హార్న్ ఇచ్చినా ఫలితం లేకపోవడంతో బ్రేక్‌తో రైలు వేగాన్ని నియంత్రించాడు. ఇంతలో పట్టాలపై నుంచి ఏనుగు తిన్నగా తప్పుకుంది. ఇంజిన్ డ్రైవర్ బ్రేక్ వేసి రైలు వేగాన్ని తగ్గించడంతో ఏనుగు ప్రాణాలతో బయటపడింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఏనుగు ప్రాణాలు కాపాడినందుకు రైలు ఇంజిన్ డ్రైవర్‌ను జంతు ప్రియులు మెచ్చుకుంటున్నారు.
ఈ వీడియోను ఓ రైల్వే అధికారి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. బ్రేక్ వేసి ఏనుగు ప్రాణాలు కాపాడిన రైలు ఇంజిన్ డ్రైవర్లను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో వేగ నియంత్రణ కఠినంగా అమలయ్యేలా చూడాలని కొందరు సూచిస్తున్నారు.
Alert LP & ALP of 15484Dn Mahananda Exp Sri K.Chanda & K.Kumar suddenly noticed one Wild Elephant crossing & obstructing the track at KM 20/4 between Sivok- Gulma 13.40 hrs today & applied brake to control the train speed & thus saved Wildlife. pic.twitter.com/DjyGQEsAeE
— DRM APDJ (@drm_apdj) January 11, 2022
Also Read..
Booster Shot Scam: బూస్టర్ డోస్ స్కామ్.. వీరిని అస్సలు నమ్మకండి.. లేదంటే డబ్బులు మాయం..