కల్యాణ్ రామ్ సరసన బన్నీ హీరోయిన్లు
ఇటీవల వచ్చిన ‘118’తో కమర్షియల్‌గానూ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు కల్యాణ్ రామ్. ప్రస్తుతం ఈ హీరో కొత్త దర్శకుడు వేణు మల్లాడి దర్శకత్వంలో నటించనున్నాడు. ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతోన్న ఈ చిత్రానికి ‘తుగ్లక్’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి హీరోయిన్లు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్‌లను ఈ చిత్రం […]
ఇటీవల వచ్చిన ‘118’తో కమర్షియల్‌గానూ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు కల్యాణ్ రామ్. ప్రస్తుతం ఈ హీరో కొత్త దర్శకుడు వేణు మల్లాడి దర్శకత్వంలో నటించనున్నాడు. ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతోన్న ఈ చిత్రానికి ‘తుగ్లక్’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి హీరోయిన్లు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్‌లను ఈ చిత్రం కోసం సంప్రదించారని, ఇందులో నటించేందుకు వారిద్దరు ఒప్పుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక 13వ శతాబ్దం బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కబోతోన్న ఈ చిత్రంలో వీరిద్దరి పాత్రలు కీలకంగా ఉండనున్నాయని టాక్. ఒకవేళ ఇదే నిజమైతే ‘సరైనోడు’ తరువాత ఈ ఇద్దరు కలిసి నటించే మరో చిత్రం ఇదే అవుతుంది. కాగా 20కోట్ల బడ్జెట్‌తో నిర్మితమవుతోన్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నిర్మించనుంది.