Raashi Khanna: మరోసారి అక్కినేని యంగ్ హీరోతో అందాల రాశిఖన్నా.. ఏ సినిమాలో అంటే

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన నటించిన

Raashi Khanna: మరోసారి అక్కినేని యంగ్ హీరోతో అందాల రాశిఖన్నా.. ఏ సినిమాలో అంటే
Raashi Khanna
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 02, 2021 | 8:55 PM

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన నటించిన లవ్ స్టోరీ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన లవ్ స్టోరీ సాంగ్స్ , టీజర్ సినిమాపైనే అంచనాలను పెంచేసాయి. ఈ సినిమా తర్వాత అక్కినేని ఫ్యామిలీకి మనంలాంటి మెమరబుల్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘థాంక్యూ’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది.

థాంక్యూ సినిమాలో చైతన్య సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానిగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి లీకైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ సినిమా హీరోయిన్ ఎవరు అనే దానిపై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు. అయితే  ఈ సినిమాలో అందాల భామ రాశిఖన్నా నాగచైతన్యతో రొమాన్స్ చేయనుందని టాక్ వినిపిస్తుంది. గతంలో ఈ ఇద్దరు కలిసి వెంకీమామ సినిమాలో నటించారు. ఇదిలా ఉంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు థాంక్స్ యు సినిమాను నిర్మిస్తున్నారు . ఈ సినిమాకు పిసి శ్రీరామ్ ఛాయాగ్రహణం, బివిఎస్ రవి  కథ రాస్తున్నారు,  ఎస్ ఎస్ తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నరు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ట్విట్టర్‌లో చిరును లక్ష మంది ఫాలో అవుతోన్నా.. ఆయన మాత్రం ఒక్కరినే ఫాలో అవుతున్నారు.. ఇంతకీ ఎవరా ఒక్కరు.?

Wild Dog: ఆకట్టుకుంటున్న అక్కినేని నాగార్జున సినిమా.. వైల్డ్ డాగ్ మూవీ ఎలా ఉందంటే..

Manju Warrier pic viral : టీనేజ్‌ అమ్మాయిలా కనిపిస్తున్న నలభై ఏళ్ల హీరోయిన్.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫొటోలు..