Superstar Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఉన్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..
నేటికీ కూడా దేశ విదేశాల్లో కోట్లాది మంది అభిమానుల ఆదరణ పొందుతున్న రజినీకాంత్ కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
Superstar Rajinikanth: నేటికీ కూడా దేశ విదేశాల్లో కోట్లాది మంది అభిమానుల ఆదరణ పొందుతున్న రజినీకాంత్ కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే పురస్కారాన్ని 2020 సంవత్సరానికిగాను సూపర్ స్టార్ రజనీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ తన ట్విట్టర్ ఖాతాలో స్వయంగా ప్రకటించారు. ‘ఇండియన్ సినిమా రంగంలో అత్యున్నత నటుల్లో ఒకరైన రజనీకాంత్ గారికి ఈ సంవత్సరం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందించనున్నాము. ఓ నటుడిగా, నిర్మాతగా స్క్రీన్ రైటర్ గా చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు అద్భుతం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చాలా సంతోషిస్తున్నాను’ అంటూ మంత్రి ప్రకాశ్ జావదేకర్ వెల్లడించారు.
సూపర్ స్టార్ కు అరుదైన గౌరవం దక్కడం పై సర్వత్రా ప్రసంశలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా తారలు, ఇతర సెలబ్రెటీలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా రజినీకి విషెస్ తెలిపారు. సోషల్ మీడియాలో అత్యంత ఆకర్షణగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ పోస్ట్ నిలిచింది. ఎందుకంటే హృతిక్ సూపర్ స్టార్ రజినీతో కలిసిన ఫోటో పోస్ట్ చేసాడు. అదికూడా ఇంతవరకు ఎవరూ చూడనిది. హృతిక్ చిన్నప్పుడు రజినీని హత్తుకొని దిగిన ఫోటో అది. ఎంతో ప్రేమగా హృతిక్ ను ఆలింగనం చేసుకున్నారు తలైవా.
మరిన్ని ఇక్కడ చదవండి :
Wild Dog: ఆకట్టుకుంటున్న అక్కినేని నాగార్జున సినిమా.. వైల్డ్ డాగ్ మూవీ ఎలా ఉందంటే..