Wild Dog: ఆకట్టుకుంటున్న అక్కినేని నాగార్జున సినిమా.. వైల్డ్ డాగ్ మూవీ ఎలా ఉందంటే..

అక్కినేని నాగార్జున చాలా రోజుల తర్వాత 'వైల్డ్ డాగ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఏప్రిల్ 2న గ్రాండ్‏గా విడుదలైంది ఈ సినిమా. టెర్రరిస్టుల బాంబు దాడుల

Wild Dog: ఆకట్టుకుంటున్న అక్కినేని నాగార్జున సినిమా.. వైల్డ్ డాగ్  మూవీ ఎలా ఉందంటే..
Wild Dog
Follow us

|

Updated on: Apr 02, 2021 | 8:24 PM

చిత్రం: వైల్డ్ డాగ్

నటీనటులు: అక్కినేని నాగార్జున‌, దియా మీర్జా, స‌యామీ ఖేర్‌, అతుల్ కుల‌క‌ర్ణి, అలీ రెజా, అప్పాజీ అంబ‌రీష త‌దిత‌రులు సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌

నిర్మాతలు:  నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి స్క్రీన్ ప్లే-దర్శకత్వం:  అహిషోర్ సాల్మ‌న్‌

అక్కినేని నాగార్జున చాలా రోజుల తర్వాత ‘వైల్డ్ డాగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఏప్రిల్ 2న గ్రాండ్‏గా విడుదలైంది ఈ సినిమా. టెర్రరిస్టుల బాంబు దాడుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో నాగార్జున నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ (ఎన్ఐఏ)లో ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున కనిపించారు. బాంబు దాడులు జరిపిన టెర్రరిస్టులను నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ (ఎన్ఐఏ)లో ఏసీపీగా ప‌నిచేసే విజ‌య్ వ‌ర్మ ఎలా తుద‌ముట్టించాడనే విష‌యాన్ని సినిమాలో చూపించారు. ఇక ఈ సినిజమ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం..

కథ : 

పూణేలోని ఒక బేకరీలో భారీ బాంబ్ పేలుడు జరుగుతుంది. ఈ బ్లాస్ట్‌లో చాలా మంది చనిపోతారు. అయితే, ఈ ఈ దాడికి పాల్పడినది ఎవరు అనే విషయంలో పోలీసులకు అంతుచిక్కదు . పోలీసులు ఎంత ప్రయత్నించిన ఒక్క క్లూ కూడా దొరకదు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ఎన్ఐఏ మాజీ అధికారి విక్రమ్ వర్మ అలియాస్ బ్లాక్ డాగ్ (నాగార్జున)ను ప్రభుత్వం రంగంలోకి దించుతుంది. విక్రమ్ వర్మ తన టీమ్‌తో కలిసి ఈ కేసును ఎలా ఇన్వెస్టిగేట్ చేశారు? ఈ బాంబు దాడికి పాల్పడిన టెర్రరిస్ట్‌ను బ్లాక్ డాగ్ టీమ్ ఎలా పట్టుకుంది? అనేది తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..

ఎవరు ఎలా చేసారంటే.. 

వరుస బాంబ్ బ్లాస్ట్‌లు జరగడాన్ని ఫస్ట్ ఆఫ్ లో చూపించారు. ఈ తీవ్ర‌వాద చ‌ర్య‌ల‌కు కార‌ణ‌మైన వారిని క‌నుక్కునే  నాగార్జున పాత్రఆకట్టుకుంది. విజ‌య్ వ‌ర్మ పాత్ర ఎలా బిహేవ్ చేస్తాడు అనే విష‌యాన్ని ఫైట్ ద్వారా చూపించారు. యాక్షన్ ఎపిసోడ్స్ తోపాటు  ఎమోష‌న‌ల్ యాంగిల్‌ను కూడా చూపించారు. ఈ పాత్ర‌లో నాగార్జున చ‌క్క‌గా సూట్ అయ్యాడు. పంచ్ డయలాగ్స్, లౌడ్ చాలెంజులు లేకుండా డరెక్ట్ గా యాక్షన్ లోకి దిగిపోయే పాత్రకి నాగార్జున న్యాయం చేసారు. ఇత‌న భార్య పాత్ర‌లో దియా మీర్జా క‌నిపించింది. ఇక అలీరెజా ఇత‌ర స‌భ్యుల‌తో నాగ్ పాత్ర కేసులో ప్ర‌ధాన సూత్ర‌ధారి ఎవ‌ర‌నే విష‌యాన్ని క‌నిపెడుతుంది. ఆ పాత్ర‌ను ప‌ట్టుకోవ‌డానికి చేసే ప్లానింగ్‌ను చ‌క్క‌గా తీశారు. ఇక మిగిలిన వారు వారి పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. కెమెరాప‌నిత‌నం కూడా ఆక‌ట్టుకుంటుంది. దర్శకుడు సాల్మ‌న్‌.. ఓ సీరియ‌స్ యాక్ష‌న్ సినిమా తీద్దామ‌నుకున్నాడు. జోన‌ర్ ని కూడా బ‌లంగానే ఎంచుకున్నాడు. సినిమా టెక్నికల్‌గా చాలా రిచ్‌గా ఉంది. షానియల్ డియో సినిమాటోగ్రఫీ, తమన్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్లు. నేపాల్-ఇండియా బార్డర్ సన్నివేశాలు, అడవిలో ఉగ్రవాదుల వేట వంటి సీన్స్‌ను తన కెమెరాలో అద్భుతంగా బంధించారు షానియర్ డియో.

చివరగా .. 

యాక్షన్ హైలైట్ గా సాగిన వైల్డ్ డాగ్..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో