AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manju Warrier pic viral : టీనేజ్‌ అమ్మాయిలా కనిపిస్తున్న నలభై ఏళ్ల హీరోయిన్.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫొటోలు..

Manju Warrier pic viral : ఎన్నో సంవత్సరాలుగా సినిమాల్లో నటిస్తూ మలయాళం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు మంజు వారియర్. మంజు వారియర్ 1995 లో వచ్చిన సాక్ష్యం అనే

Manju Warrier pic viral : టీనేజ్‌ అమ్మాయిలా కనిపిస్తున్న నలభై ఏళ్ల హీరోయిన్.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫొటోలు..
Manju Warrier Pic Viral
uppula Raju
|

Updated on: Apr 02, 2021 | 8:25 PM

Share

Manju Warrier pic viral : ఎన్నో సంవత్సరాలుగా సినిమాల్లో నటిస్తూ మలయాళం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు మంజు వారియర్. మంజు వారియర్ 1995 లో వచ్చిన సాక్ష్యం అనే మలయాళ సినిమాతో తన సినిమా కెరీర్ ని మొదలు పెట్టారు. అప్పటికి మంజు వారియర్ వయసు దాదాపు 17 సంవత్సరాలు. ఆ తర్వాత ఎన్నో మలయాళం సినిమాల్లో నటించారు. మంజు వారియర్ మంచి డాన్సర్ కూడా. తన డాన్స్ కి ఎన్నో అవార్డులను అందుకున్నారు.

17 సంవత్సరాలకి తన కెరీర్ ని మొదలు పెట్టిన మంజు వారియర్, 18 సంవత్సరాల అప్పుడు సల్లప్పం అనే సినిమాలో నటించారు. ఆ సినిమాలో హీరోగా నటించిన దిలీప్ ని 1998లో పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికీ మీనాక్షి అనే పాప కూడా ఉంది. పెళ్లయిన తర్వాత మంజు వారియర్ ఎక్కువగా సినిమాలు చేయలేదు. 2012 లో గురువాయుర్ శ్రీ కృష్ణ ఆలయంలో కూచిపూడి ప్రదర్శన ఇచ్చారు మంజు వారియర్.

అయితే ఆమె 2014 నుంచి సినిమాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ‘చతుర్ ముఖమ్’ సినిమా చేస్తున్న మంజూ..ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ క్రమంలో వైట్ టాప్, నీ లెంత్ బ్లాక్ స్కర్ట్, వైట్ షూస్, బేబీ బ్యాండ్ హెయిర్ స్టైల్‌లో టీనేజ్ గర్ల్‌గా కనిపించి షాక్ ఇచ్చింది. 42 ఏళ్ల వయసులో స్కూల్ పిల్లలాగా కనిపిస్తున్న తనను చూసి నెటిజన్లు షాక్ అవుతుండగా ఫొటోస్ వైరల్ అయ్యాయి. ధనుష్‌తో కలిసి ‘అసురన్’ సినిమా చేసిన భామ.. తన స్టైలిష్ అండ్ క్యూట్ లుక్స్‌తో ఇంటర్నెట్‌ను మెస్మరైజ్ చేసేసింది.

ట్విట్టర్‌లో చిరును లక్ష మంది ఫాలో అవుతోన్నా.. ఆయన మాత్రం ఒక్కరినే ఫాలో అవుతున్నారు.. ఇంతకీ ఎవరా ఒక్కరు.?

Most Eligible Bachelor: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమానుంచి క్రేజీ అప్డేట్.. ఏప్రిల్ 5న…

Pawan Kalyan : పవన్ డేడికేషన్ కు ఫిదా అవుతున్న అభిమానులు.. వైరల్ అవుతున్న ఫోటోలు