Pushpa Movie: పుష్ప మేకింగ్‌ వీడియోను చూశారా.? బన్నీ ఇచ్చిన మెసేజ్‌ మాత్రం అదుర్స్‌..

Pushpa Movie: అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం పుష్ప. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బన్నీకి జోడిగా రష్మిక నటిస్తోంది. ఇప్పటి వరకు స్టైలిష్‌ లుక్‌లో..

Pushpa Movie: పుష్ప మేకింగ్‌ వీడియోను చూశారా.? బన్నీ ఇచ్చిన మెసేజ్‌ మాత్రం అదుర్స్‌..
Pushpa Making Video
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 05, 2021 | 12:53 PM

Pushpa Movie: అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం పుష్ప. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బన్నీకి జోడిగా రష్మిక నటిస్తోంది. ఇప్పటి వరకు స్టైలిష్‌ లుక్‌లో కనిపించిన బన్నీ తొలి సారి పూర్తి మాస్‌ రోల్‌లో ఒక లారీ డ్రైవర్‌ పాత్రలో కనిపించనున్నాడు. దీతో ఈ సినిమాపై సహంజగానే అంచనాలు పెరిగిపోతాయి. అందులోనూ ఆర్య, ఆర్య2 వంటి చిత్రాల తర్వాత బన్నీ, సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం కావడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. ఇక ఈ సినిమాను క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 17న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్స్‌ వేగాన్ని పెంచింది చిత్ర యూనిట్‌. ఇందులో భాగంగానే రేపు అంటే సోమవారం సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనుంది.

ఇదిలా ఉంటే ట్రైలర్‌ విడదలకు ఒకరోజు ముందే ఫ్యాన్స్‌కు మేకింగ్ వీడియో రూపంలో చిత్ర యూనిట్‌ మరో గిఫ్ట్‌ను ఇచ్చింది. మారేడుపల్లి అడవుల్లో షూటింగ్‌కు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్‌ షేర్‌ చేసింది. ఇక ఈ వీడియోలో చిత్ర యూనిట్‌ను ఉద్దేశిస్తూ బన్నీ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆకట్టుకుంటున్నాయి. ‘చిత్రీకరణలో భాగంగా అడవిలోకి ఎలా వచ్చామో.. అలాగే తిరిగి వెళ్లాలని’ చెప్పారు బన్నీ. తాగి పడేసే ప్లాస్టిక్ కప్స్‌, బాటిళ్లను డస్ట్ బిన్‌లో వేయాలని తెలిపారు. బన్నీ ఇచ్చిన ఈ మెసేజ్‌ ఆకట్టుకుంటోంది. ఇక మేకింగ్ వీడియోను చూస్తుంటే అడవిలో పుష్ప టీమ్‌ పడ్డ కష్టం కనిపిస్తోంది. భారీ అంచనాల నడుమ రేపు రానున్న టీజర్‌ నెట్టింట ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

Also Read: Rosaiah Funerals: గాంధీ భవన్‌కు మాజీ సీఎం రోశయ్య పార్థివదేహాం.. ఇవాళ దేవరయాంజల్‌ ఫాంహౌస్‌లో అంత్యక్రియలు..!

Cook Islands: కరోనా వెలుగులోకి వచ్చిన రెండేళ్లకు ఆ దేశంలో మొదటి కేసు నమోదు.. ప్రభుత్వం అలెర్ట్..

Viral News: ‘నేను కావాలా.. మటన్ కావాలా’.. భార్యకు భర్త అల్టిమేటం.. వైరల్‌గా మారిన ట్వీట్!