Akira Nandan: తల్లి కోరికను తీర్చిన అకిరా.. తన పుట్టిన రోజుకి వెలకట్టలేని బహుమతి అంటున్న రేణు దేశాయ్..

Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముద్దుల తనయుడు తల్లిదండ్రుల విడాకుల అనంతరం తల్లి రేణు దేశాయ్ దగ్గర పెరుగుతున్న సంగతి తెలిసిందే. పుణేలో నివసిస్తున్న అకిరా తన తల్లి పుట్టిన రోజుకి..

Akira Nandan: తల్లి కోరికను తీర్చిన అకిరా.. తన పుట్టిన రోజుకి వెలకట్టలేని బహుమతి అంటున్న రేణు దేశాయ్..
Akira Nandan
Follow us
Surya Kala

|

Updated on: Dec 05, 2021 | 12:54 PM

Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముద్దుల తనయుడు తల్లిదండ్రుల విడాకుల అనంతరం తల్లి రేణు దేశాయ్ దగ్గర పెరుగుతున్న సంగతి తెలిసిందే. పుణేలో నివసిస్తున్న అకిరా తన తల్లి పుట్టిన రోజుకి ఓ అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడట. ఇదే విషయాన్నీ అకిరా తల్లి రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. తాను తన కొడుకు అకిరా నందన్ ని ఒక నెల క్రితం పుట్టిన కనుకగా తనకు ఇష్టమైన పాటను ఇవ్వమని కోరినట్లు చెప్పారు రేణు దేశాయ్. తన కోరికను అకిరా పుట్టిన రోజు సందర్భంగా  తీర్చినట్లు వెలకట్టలేని బహుమతిని చ్చినట్లు చెప్పారు. అంతేకాదు బొంబాయి సినిమాటలోని తనకు ఇష్టమైన సాంగ్ “ఊరికే చిలకా వేచి ఉంటానే కడ వరకు” సాంగ్ ను అకిరా పియానో మీద కంపోజ్ చేశాడని చెప్పారు. అంతేకాదు.. అకిరా సాంగ్ ని కంపోజ్ చేస్తున్న వీడియో ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

ఈ వీడియో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పటికే అకిరా తండ్రికి ఏ మాత్రం తీసిపోని విధంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. మార్షల్ ఆర్ట్స్ ఇతరులకు నేర్పుతూ.. గురువు అయ్యాడు.. ఇప్పుడు పియానో మెట్ల మీద సరిగమలు వాయిస్తూ.. మ్యూజిక్ కంపోజ్ చేయడంలో కూడా అకిరా ప్రతిభని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ తనయుడు అకిరానందన్ ఎప్పుడు ఎక్కడ కనిపించినా సెంటరాఫ్ అట్రాక్షన్ గా =నిలుస్తాడు. అందరి దృష్టిని ఆకర్షిస్తాడు. తల్లి రేణు దేశాయ్ దగ్గర నివసిస్తున్న అకిరా, ఆద్యలు .. మెగా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ జరిగినా   హాజరవుతారు.. తమ అన్నదమ్ములతో కలిసి సంతోషంగా గడుపుతారు.. అన్న వరుణ్ తేజ్ పొడవుకు ఇక 17 ఏళ్లకే అకిరా.. పోటీ వచ్చేస్తున్నాడు. మెగా ఫ్యామిలీ అందరికంటే పొడవు అనిపిస్తూ.. తాను కూడా నెక్స్ట్ హీరోగా ఎంట్రీకి రెడీ అని చెప్పకనే చెప్పేస్తున్నాడు పవన్ తనయుడు.

View this post on Instagram

A post shared by renu (@renuudesai)

Also Read:   ఓ ఇంటి బయట కింగ్ కోబ్రా కలకలం.. ప్రపంచంలో సిగ్గరి ఈ పాము.. హానిచేయవద్దంటున్న స్నేక్ క్యాచర్స్ ..