King Cobra: ఓ ఇంటి బయట కింగ్ కోబ్రా కలకలం.. ప్రపంచంలో సిగ్గరి ఈ పాము.. హానిచేయవద్దంటున్న స్నేక్ క్యాచర్స్ ..
King Cobra: ఒడిస్సా లోని మల్కాన్ గిరి జిల్లాలో కింగ్ కోబ్రా కలకలం రేపింది. కలిమేల పోలీస్ స్టేషన్ పరిధిలో MV11 గ్రామంలో ఓ గ్రామస్థుడి ఇంట్లో ఉన్న చెట్టు పై భారీ కింగ్ కోబ్రా..
King Cobra: ఒడిస్సా లోని మల్కాన్ గిరి జిల్లాలో కింగ్ కోబ్రా కలకలం రేపింది. కలిమేల పోలీస్ స్టేషన్ పరిధిలో MV11 గ్రామంలో ఓ గ్రామస్థుడి ఇంట్లో ఉన్న చెట్టు పై భారీ కింగ్ కోబ్రా కనిపించింది. సుమారు 12 అడుగులున్న ఈ భారీ కింగ్ కోబ్రాని చూడగానే స్థానికులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమై స్నేక్ క్యాచర్స్ కి ఫోన్ చేసి సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్స్ చాకచక్యంతో ఈ కింగ్ కోబ్రాని పట్టుకుని సమీపంలోని అడవిలో సురక్షితంగా విడిచిపెట్టారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. స్వతహాగా ఈ కింగ్ కోబ్రాలు హాని చేయవని.. బహు సిగ్గరి అని .. ఎవరూ కంగారుపడాల్సిన పని లేదంటున్నారు.
ప్రపంచంలో అత్యంత పెద్ద, పొడవైన విష విషసర్పాల్లో నల్లత్రాచు, (రాచనాగు లేదా కింగ్ కోబ్రా) మొదటిది. ఈ పాము సాధారణంగా 18.5 అడుగుల పొడవు పెరుగుతుంది. గుడ్లను పొదగడానికి గూడు కట్టే ఏకైక సర్పం. ఇక ఆడపాము 20-40 గుడ్లను దిబ్బ మాదిరిగా పెడుతుంది. సుమారు 20ఏళ్ళు జీవిస్తుంది. ఈ పాము విషయం మెదడుపై అత్యంత ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ పాము కాటువేస్తే.. ఆహారముగా ఇతర పాములను, కొండ చిలువలను తింటుంది. చూడడానికే భయంకరంగా ఉండే ఈ కింగ్ కోబ్రా స్వతహాగా సిగ్గరి. సాధారణంగా ముఖాముఖి ఎవరి కంటబడానికి ఇష్ట పడదు.
కింగ్ కోబ్రా పడగ పైకెత్తితే ఆరు అడుగుల ఎత్తు ఉంటుంది.. కింగ్ కోబ్రా దట్టమైన అరణ్యాలలో.. చుట్టూ సెలయేళ్ళు, చెరువులు ఉన్న ప్రదేశాలలో నివసించడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. ఇది నీటిలో బాగా ఈదగలదు. ఈ జాతి పాములు ఆంధ్ర ప్రదేశ్‌లో అల్లూరి సీతారామరాజు (ఈస్ట్రన్ గాట్స్) ఫారెస్ట్ లో అధికంగా కనిపిస్తాయి. కింగ్ కోబ్రాను కేరళలో ఈ “నాగరాజు”గా పూజిస్తారు. ముఖ్యంగా కేరళలో “నాయర్” అనబడే కులస్తులు ఈ పామును “కావు” అనే పేరుతో పూజిస్తారు.
Also Read: భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని మనస్తాపంతో భార్య ఆత్మహత్య..