Crime News: ప్రియుడిపై యాసిడ్ పోసి కత్తితో పొడిచిన ప్రియురాలు.. భయంతో ఆత్మహత్యాయత్నం!
తమిళనాడులో దారుణం జరిగింది. ప్రేమించిన వ్యక్తిపై యాసిడ్ పోసి కత్తితో దాడికి పాల్పడింది ఓ యువతి.
Lover pouring acid on Boyfriend: తమిళనాడులో దారుణం జరిగింది. ప్రేమించిన వ్యక్తిపై యాసిడ్ పోసి కత్తితో దాడికి పాల్పడింది ఓ యువతి. కోయంబత్తూరులో పట్టపగలు జరిగిన ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. రెండేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరొకరిని పెళ్లాడాడు ఓ యువకుడు. దీంతో కొపం పెంచుకున్న ప్రియురాలు మాట్లాడుకుందాం అని వచ్చి యాసిడ్ పోసింది. అంతటితో ఆగకుండా కత్తితో పొడిచింది. ఆ తర్వాత తానూ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు.
రళ రాష్ట్రం తిరువనంతపురంనకు చెందిన రాకేష్(30), కాంచీపురానికి చెందిన జయంతి (27) మూడేళ్లుగా దుబాయ్‌లోని ఓ మసాజ్ సెంటర్‌లో పనిచేశాడు. చెంగల్పట్టు జిల్లా మీనంబాక్కం తిరువల్లువర్ రోడ్డుకు చెందిన జయంతి (27) కూడా ఇదే మసాజ్ సెంటర్‌లో పనిచేస్తోంది. జయంతికి వివాహమై ఒక ఆడపిల్ల కూడా ఉంది. కానీ, ఆమె భర్త నుండి విడిపోయి దుబాయ్‌లో ఉద్యోగం చేస్తోంది. దుబాయ్‌లో ఒకే చోట పని చేస్తూ రాజేస్-జయంతి ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. సహాజీవనం కూడా చేశారు. ఈ స్థితిలో రాకేష్ తన సోదరి పెళ్లి కోసం కేరళ వెళ్తున్నట్లు జయంతికి చెప్పాడు. ఇలా ఇద్దరు గత కొన్ని నెలలుగా దుబాయ్ నుంచి తమిళనాడుకు తిరిగి వచ్చేశారు.
అయితే, ఆర్నెల్ల క్రితం స్వస్థలాలకు తిరిగి వచ్చారు. ఇటీవల జయంతికి తెలియకుండా రాకేష్ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆమె ఫోన్ చేసి గొడవపడింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం కోయంబత్తూరు పీలమేడు ప్రాంతంలో ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకున్నారు. ఆ సమయంలో మాటామాటా పెరగడంతో జయంతి వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను రాకేష్‌పై పోసి, కత్తితో దాడి చేసింది. ఆ తర్వాత ఆమె నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇద్దరూ అచేతనంగా పడిఉండటం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. ఇద్దరిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పీలమేడు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Read Also… Road Accident: కోరుట్లలో ఘోర రోడ్డుప్రమాదం.. కారు-బస్సు ఢీ.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి!