Covid – 19 Omicron: దేశంలో మొదలైన ఒమిక్రాన్ టెన్షన్.. ఢిల్లీలో తొలి కేసు.. ఐదుకు చేరిన పాజిటివ్ సంఖ్య

దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ ప్రకంపనలు మొదలయ్యాయి . అంతకంతకూ కేసులు పెరిగిపోతున్నాయి.

Covid - 19 Omicron: దేశంలో మొదలైన ఒమిక్రాన్ టెన్షన్.. ఢిల్లీలో తొలి కేసు..  ఐదుకు చేరిన పాజిటివ్ సంఖ్య
Covid Omicron
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 05, 2021 | 12:10 PM

Coronavirus Omicron Variant: దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ ప్రకంపనలు మొదలయ్యాయి . అంతకంతకూ కేసులు పెరిగిపోతున్నాయి. రెండ్రోజుల క్రితమే దేశంలోకి ఎంట్రీ ఇచ్చిన న్యూ వేరియంట్‌ విస్తరణలో వేగం పుంజుకుంది. ఫస్ట్‌ డే బెంగళూరులో 2 కేసులు.. నెక్స్ట్‌ డే మరో రెండు.. గుజరాత్‌లో ఒకటి, ముంబైలో మరో కేసు.. ఇవాళ ఢిల్లీలో మరో ఒమిక్రాన్‌ పాజిటివ్‌ నిర్థారణ అయింది.. ఇప్పటివరకు 5 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ధృవీకరించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

టాంజానియా నుండి ఇండియాకు తిరిగి వచ్చిన ఓ వ్యక్తి స్వల్ప లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో అంతనికి కోవిడ్‌ పాజిటివ్ ఓమిక్రాన్ సంక్రమించినట్లు నిర్ధారించారు వైద్యులు. దీంతో అతన్ని LNJP ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు.

ఒమిక్రాన్‌తోనే టెన్షన్‌ పడుతుంటే..మరోవైపు కరోనా మరణాలు కూడా ఎక్కువవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 2,796 మరణాలు నమోదయ్యాయి. ఇక 24గంటల్లో 8,895 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న కొవిడ్ నుంచి కొత్తగా 8,190 మంది కోలుకున్నారు. ఐతే రికవరీల కంటే కొత్త కేసులు, మరణాలు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

Read Also…  Black Magic: భార్యను హతమార్చేందుకు భర్త క్షుద్ర పూజలు.. అసల విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!