Akhanda: ‘అఖండ’పై అన్షుల్ సక్సేనా ప్రశంసలు.. ‘జై బాలయ్య’ అని కామెంట్..

అన్షుల్ సక్సేనా... ఈ పేరు ఇంటర్నెట్‌లో నిరంతరం ట్రెండ్ అవుతూ ఉంటుంది. అసలు ఇతడు ఎవరు..? ఎందుకు ఇంత ఫేమస్ అయ్యాడు అనే విషయం చాలామందికి తెలిసి ఉండదు.

Akhanda: 'అఖండ'పై అన్షుల్ సక్సేనా ప్రశంసలు.. 'జై బాలయ్య' అని కామెంట్..
Akhanda
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 05, 2021 | 1:07 PM

అన్షుల్ సక్సేనా… ఈ పేరు ఇంటర్నెట్‌లో నిరంతరం ట్రెండ్ అవుతూ ఉంటుంది. అసలు ఇతడు ఎవరు..? ఎందుకు ఇంత ఫేమస్ అయ్యాడు అనే విషయం చాలామందికి తెలిసి ఉండదు.  జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామాలో 2019, ఫిబ్రవరి 14న తీవ్రవాద దాడి కారణంగా 40 మందికి పైగా జవాన్లు అమరులు అయ్యారు. సీఆర్పీఎఫ్ దళంపై మిలిటెంట్ దాడి జరిగిన తర్వాత భారతదేశం అంతటా మరోసారి పాక్ వ్యతిరేక భావనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో అన్షుల్ సక్సేనా పాకిస్తాన్ పైన తనకు తెలిసిన విద్య ద్వారా ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నాలు చేశాడు. ఇందులో భాగంగా పాకిస్తాన్‌కు చెందిన పలు వెబ్ సైట్లను హ్యాక్ చేశాడు. అలా నెటిజన్లు దృష్టి ఆకర్షించాడు. అనంతరం పలు విషయాలపై ఇతడు స్పందించే విధానం.. చాలామందిని ఇన్‌స్పైర్ చేసింది. అయితే తాజాగా అన్షుల్ సక్సేనా తెలుగునాట ట్రెండ్ అవుతున్నాడు.

‘బాలయ్య’ అఖండ అద్భుతమని అన్షుల్ పోస్ట్..

డిసెంబర్ 2న బాలయ్య నటించిన ‘అఖండ’ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. కలెక్షన్ల మోత మోగిస్తోంది. బాలయ్య నటనకు మాస్ జనాలు జేజేలు కొడుతున్నారు. నటసింహం కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అని కితాబిస్తున్నారు. తాజాగా ఈ మూవీపై అన్షుల్ సక్సేనా ఫేసుబుక్‌లో పోస్ట్ పెట్టాడు. మూవీలోని ఓ సీన్‌కు సంబంధించిన ఇమేజ్ షేర్ చేశాడు. వాటే సీన్ అంటూ ప్రశంసించాడు. ఈ సినిమా అందరూ తప్పక చూడాలని… ఇతర భాషల్లో కూడా విడుదల కావాలని ఆకాక్షించాడు. పనిలో పనిగా ‘జై బాలయ్య’ అని కామెంట్ పెట్టాడు. అసలే ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఓవైపు అన్‌స్టాపబుల్, మరోవైపు అఖండ.. విజయాలతో పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అన్షుల్ పెట్టిన పోస్ట్‌ స్క్రీన్ షాట్ కొట్టి.. బాలయ్య స్థాయి ఇది అని షేర్ చేస్తున్నారు.

Also Read: యాంకర్ అనసూయ ఇంట తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతున్న స్టార్ యాంకర్

చెత్త ఏరుకునే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకున్న వివాహిత.. మర్డర్ కేసు విచారణలో నమ్మలేని విషయాలు