AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: చెత్త ఏరుకునే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకున్న వివాహిత.. మర్డర్ కేసు విచారణలో నమ్మలేని విషయాలు

 క్షణికమైన సుఖం కోసం తప్పటడుగులు వేస్తున్నారు. అక్రమ సంబంధాల మోజులో కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. పచ్చని కాపురాల్లో అఫైర్స్ చిచ్చు రేపుతున్నాయి.

Telangana:  చెత్త ఏరుకునే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకున్న వివాహిత.. మర్డర్ కేసు విచారణలో నమ్మలేని విషయాలు
Telangana Crime News
Ram Naramaneni
|

Updated on: Dec 05, 2021 | 11:27 AM

Share

క్షణికమైన సుఖం కోసం తప్పటడుగులు వేస్తున్నారు. అక్రమ సంబంధాల మోజులో కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. పచ్చని కాపురాల్లో అఫైర్స్ చిచ్చు రేపుతున్నాయి. చివరికి పరిస్థితి కొన్ని చోట్ల చంపుడం వరకో, ప్రాణాలు తీసుకోవడం వరకో వెళ్తోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలో సంచలన ఘటన వెలుగుచూసింది. గురువారం రాత్రి ఓ పాడుబడ్డ ఇంట్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు విచారణ సమయంలో నమ్మలేని విషయాలు వెలుగుచూశాయి. చనిపోయిన వ్యక్తి కర్నూలు జిల్లాకు చెందిన నాగరాజుగా గుర్తించారు. ఇతడు షాద్ నగర్‌లో నివసిస్తూ రోడ్ల పక్కన చెత్త ఏరుకుంటూ జీవనం సాగించేవాడు. అయితే ప్రాథమిక విచారణలో ఈ మర్డర్‌కు కారణం అక్రమ సంబంధం అని తేలింది.

స్థానిక పటేల్ రోడ్డులోనే నివసించే ఓ పెళ్లైన మహిళతో నాగరాజు వివాహేతర బంధం కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. సదరు వివాహితకు చెత్త కోసం వచ్చే నాగరాజు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. చెత్త ఏరుకునే వ్యక్తే కాబట్టి ఎవరూ ఆ రకంగా అనుకోరని సదరు మహిళ భావించింది. దీంతో ఆమె భర్త బయటకి వెళ్లగానే.. నాగరాజు చెత్త ఏరుకునే నెపంతో అక్కడికి వచ్చేవాడు. అయితే ఏ పాడు పని అయినా ఎన్ని రోజులు దాగుతుంది చెప్పండి. చుట్టపక్కల జనాల ద్వారా మహిళ భర్తకు ఈ విషయం తెలిసింది. దీంతో అతడికి కోపం, ఆవేశం ఒకేసారి వచ్చాయి.  భార్యను తిట్టినా, కొట్టినా ఫలితం లేకపోయింది. దీంతో ఆ భర్త.. నాగరాజును అంతం చేయాలనుకున్నాడు. గురువారం రాత్రి నాగరాజు ఉండే ప్రాంతానికి వెళ్లిన మహిళ భర్త.. దారుణంగా కొట్టాడు. ఏది దొరికితే  దానితో కొట్టి.. కొట్టి చంపేశాడు. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగుచూసింది. తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని షాద్ నగర్ పోలీసులు తెలిపారు.

Also Read: ఈ ఫోటోలో ఓ పాము దాగుంది.. కనిపెట్టండి చూద్దాం.. అంత ఈజీ కాదండోయ్

Follow Us
పాత సబ్బు ముక్కలను పారేస్తున్నారా? హ్యాండ్ వాష్ తయారు చేసుకోండిలా
పాత సబ్బు ముక్కలను పారేస్తున్నారా? హ్యాండ్ వాష్ తయారు చేసుకోండిలా
ఎస్‌ఐఆర్‌తో తెలంగాణలో సరికొత్త పొలిటికల్‌ వార్..
ఎస్‌ఐఆర్‌తో తెలంగాణలో సరికొత్త పొలిటికల్‌ వార్..
ప్రమాణ స్వీకారానికి ముందే మంత్రివర్గం ప్రకటించిన సతీసన్..!
ప్రమాణ స్వీకారానికి ముందే మంత్రివర్గం ప్రకటించిన సతీసన్..!
ఫ్రంట్ లోడ్ వర్సెస్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్,మీ ఇంటికి ఏది బెస్ట్
ఫ్రంట్ లోడ్ వర్సెస్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్,మీ ఇంటికి ఏది బెస్ట్
కిరాణా బిల్లు బిల్లును సగానికి సగం తగ్గించే మ్యాజిక్ ట్రిక్స్..
కిరాణా బిల్లు బిల్లును సగానికి సగం తగ్గించే మ్యాజిక్ ట్రిక్స్..
జుంకాల నుండి నెక్లెస్‌ల వరకు.. అత్యంత చౌకగా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ
జుంకాల నుండి నెక్లెస్‌ల వరకు.. అత్యంత చౌకగా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ
భారీ డ్రోన్ దాడి.. భారతీయ ఉద్యోగి మృతి!
భారీ డ్రోన్ దాడి.. భారతీయ ఉద్యోగి మృతి!
ఎన్ఎస్‌జీ హబ్‌లో షూటింగ్‌తో అదరగొట్టిన మహీ.. అసలు గాయమైందా?
ఎన్ఎస్‌జీ హబ్‌లో షూటింగ్‌తో అదరగొట్టిన మహీ.. అసలు గాయమైందా?
వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా?మొక్కలకు అమృతం లాంటి ఎరువు తయారీ
వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా?మొక్కలకు అమృతం లాంటి ఎరువు తయారీ
ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో వాన పడితే పరిస్థితి ఏంటి? రిజర్వ్ డే ఉందా ?
ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో వాన పడితే పరిస్థితి ఏంటి? రిజర్వ్ డే ఉందా ?