Cook Islands: కరోనా వెలుగులోకి వచ్చిన రెండేళ్లకు ఆ దేశంలో మొదటి కేసు నమోదు.. ప్రభుత్వం అలెర్ట్..
Cook Islands: చైనాలో పుట్టిన కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి దాదాపు రెండేళ్లు అయిపొయింది. ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టిస్తూ.. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అయిపోయి. కొన్ని దేశాలు థర్డ్ వేవ్..
Cook Islands: చైనాలో పుట్టిన కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి దాదాపు రెండేళ్లు అయిపొయింది. ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టిస్తూ.. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అయిపోయి. కొన్ని దేశాలు థర్డ్ వేవ్ ముందు ఉంది అంటూ వార్తలు వినిపించాయి. అయితే కొన్ని రోజులు కరోనా కట్టడికి వచ్చింది అనిపించింది.. కానీ తాజాగా కోవిడ్ 19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీంతో ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ మొదలు అయిందేమో అన్న సందేహాలు అందరిలోనూ మొదలయ్యి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు భయం గుప్పిట్లో బతుకున్నారు. మానవాళిని కబళిస్తోన్న ఈ కరోనా వైరస్ ఈ రెండేళ్ళలోనూ అడుగు పెట్టని ఒక దేశం ఉందని.. ఆ దేశంలో తాజాగా మొదటి కేసు నమోదయింది. ఓ పదేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. మరి తొలి కేసు నమోదు చేసుకున్న ఆ దేశం ఏమిటో తెలుసా..
ప్రపంచం నుండి దూరంగా ఉన్న ద్వీప దేశం.. కుక్ ఐలాండ్స్. ఇది సౌత్ పసిఫిక్ దేశం. ఈ దేశంలో మొత్తం 17వేల మంది నివసిస్తారు. ఈ దేశంలో మహమ్మారి ప్రారంభమైన రెండేళ్ల తర్వాత డిసెంబర్ 4 న తొలి కరోనా కేసు నమోదయింది. 10 ఏళ్ల బాలుడిలో కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణయింది. ఇదే విషయంపై ప్రధాన మంత్రి మార్క్ బ్రౌన్ స్పందిస్తూ.. డిసెంబర్ 2 న బాలుడు తన కుటుంబంతో స్వదేశానికి తిరిగి వచ్చాడని.. తర్వాత పరీక్షల్లో బాలుడికి కరోనా సోకినట్లు తెలిసిందని చెప్పారు. న్యూజిలాండ్ నుంచి ఫ్యామిలీతో ఐలాండ్‌కు తిరిగి వచ్చిన ఆ బాలుడికి కోవిడ్ గా నిర్ధారణ అయింది. దీంతో వెంటనే ప్రభుత్వం అలర్ట్ అయింది. తమ దేశంపు అంతర్జాతీయ బార్డర్లను ఐలాండ్ మూసేసింది.
అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యాక్సినేషన్ రేట్స్ ఉన్న దేశాల్లో కుక్ ఐలాండ్స్ కూడా ఉంది. దాదాపు అందరూ అక్కడ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నారు. 96 శాతం జనాభా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నట్టు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.
Also Read: మంచు దుప్పటి కప్పుకున్న బద్రినాథ్ ఆలయం.. వెన్నెల సోయగంతో హిమాచల్..