Snow Fall: మంచు దుప్పటి కప్పుకున్న బద్రినాథ్ ఆలయం.. వెన్నెల సోయగంతో హిమాచల్

Snow Fall: దేశంలో క్రమంగా చలి పెరుగుతోంది. ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో మంచు కురుస్తోంది. ముఖ్యంగా హిమాలయ పర్వతాల సమీపంలోని రాష్ట్రాల్లో తీవ్రంగా

Snow Fall: మంచు దుప్పటి కప్పుకున్న బద్రినాథ్ ఆలయం.. వెన్నెల సోయగంతో హిమాచల్
Badrinath Temple
Follow us
Surya Kala

|

Updated on: Dec 05, 2021 | 8:41 AM

Snow Fall: దేశంలో క్రమంగా చలి పెరుగుతోంది. ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో మంచు కురుస్తోంది. ముఖ్యంగా హిమాలయ పర్వతాల సమీపంలోని రాష్ట్రాల్లో తీవ్రంగా కురుస్తున్న మంచుతో సరికొత్త అందాలను సంతరించుకుంటున్నాయి.  ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో మంచు కురుస్తుండడంతో కనిషి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం ఉద‌యం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చార్‌ధామ్ క్షేత్రాల్లో ఒక‌టైన బ‌ద్రీనాథ్ లో మంచు ఆల‌య ప‌రిస‌రాల్లో విప‌రీతంగా మంచుకురిసింది. మంచు వర్షంలా కురవడంతో.. బద్రీనాథ్​ దేవాలయం మంచు దుప్పటి కప్పుకుంది. ఆల‌యం ఆవ‌ర‌ణ‌లోని మెట్లు, బ‌హిరంగ ప్రదేశం, ఆల‌య గోపురాలపై మంచుగ‌డ్డలు పేరుకుపోయాయి. ఇల్లు రహదారులు పూర్తిగా హిమం లో కలిసిపోయాయి. ఎడతెరపి లేని హిమపాతానికి రహదారి వెంట వాహనాలు ఎక్కడికక్కడే  నిలిచిపోయాయి. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ పరిసర ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ మంచువ‌ర్షం స్థానికుల‌ను చ‌లికి గ‌డ‌గ‌డ‌లాడేలా చేస్తున్నా.. మంచు కురుస్తున్న దృశ్యాలు చూప‌రుల‌కు క‌నువిందు చేస్తున్నాయి. తీవ్రమైన మంచు, చలిగాలుల ప్రభావం నేపథ్యంలో బద్రీనాథ్​ ఆలయాన్ని నవంబర్20న మూసివేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు హిమాచల్​ప్రదేశ్​లో భారీగా మంచు కురుస్తోంది.  వివిధ జిల్లాలో ఎడతెరపి లేకుండా వస్తున్న హిమపాతం కారణంగా పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.  పలు జిల్లాలు మంచుతో కప్పబడి వెండి వెన్నెలలా మెరిసిపోతూ స్వర్గధామంలా కనిపిస్తూ చూపరులను ఆకట్టుకుంటుంది.

Also Read:  ఓమిక్రాన్‌ వదలదంటూ భార్యను చంపి, పిల్లలను సుత్తితో కొట్టి చంపిన వైద్యుడు.. ఎక్కడంటే..