Uttar Pradesh: ఓమిక్రాన్‌ వదలదంటూ భార్యను చంపి, పిల్లలను సుత్తితో కొట్టి చంపిన వైద్యుడు.. ఎక్కడంటే..

Uttar Pradesh:రెండేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్.. కొత్త రూపాలను సంతరించుకుని.. మానవాళిని వెంటాడుతూనే ఉంది. కరోనా ప్రభావం శరీరకంగానే కాదు.. మానసికంగా..

Uttar Pradesh: ఓమిక్రాన్‌ వదలదంటూ భార్యను చంపి, పిల్లలను సుత్తితో కొట్టి చంపిన వైద్యుడు.. ఎక్కడంటే..
Uttarpradesh
Follow us

|

Updated on: Dec 05, 2021 | 8:13 AM

Uttar Pradesh:రెండేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్.. కొత్త రూపాలను సంతరించుకుని.. మానవాళిని వెంటాడుతూనే ఉంది. కరోనా ప్రభావం శరీరకంగానే కాదు.. మానసికంగా కూడా పడుతుంది. తాజాగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి భయాందోళన నేపథ్యంలో మానసికంగా అనారోగ్యానికి గురైన ఓ సీనియర్ ఫోరెన్సిక్ ప్రొఫెసర్ దారుణానికి పాల్పడ్డాడు. కరోనా అందరినీ చంపేస్తుంది.. తనవారిని కష్టాల నుంచి ముందుగా విడిపిస్తా అంటూ.. భార్య, పిల్లలని చంపేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని కాన్పూర్​​లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

కాన్పూర్‌లోని కళ్యాణ్‌పూర్ ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్ సుశీల్‌ నగరంలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఫోరెన్సిక్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఒమిక్రాన్ భయంతో సుశీల్‌.. కల్యాణ్‌పుర్‌లోని సొంత అపార్ట్‌మెంట్‌లో తన భార్యను , ఇద్దరు పిల్లలను హతమార్చాడు. ఈ హత్యలను తాను ఎందుకు చేశానో ఓ డైరీలో కూడా రాసుకున్నాడు. ఇప్పుడు ఓమిక్రాన్‌ వలన మృతదేహాలను లెక్కించాల్సిన అవసరం లేదు.  కరోనా  వైరస్  ప్రతి ఒక్కరినీ చంపేస్తుందని తన డైరీలో పేర్కొన్నాడు. అంతేకాదు ఈ హత్య విషయంపై తన సోదరుడు సునీల్ కు ఓ మెసేజ్ కూడా పెట్టాడు. వెంటనే సునీల్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూడగా బయట నుంచి తాళం వేసి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సెక్యూరిటీ గార్డుల సహాయంతో తాళం పగలగొట్టి అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించారు. అక్కడ వారికీ కనిపించిన దృశ్యాలను చూసి షాక్ తిన్నారు. సుశీల్ మొదట తన భార్యను గొంతు కోసి.. అనంతరం తన కొడుకు, కుమార్తె తలలపై సుత్తితో పగులగొట్టి హత్య చేసి ఇంటి నుండి పారిపోయాడని పోలీసులు తెలిపారు.

వైద్యుడి భార్య చంద్రప్రభ (48) సహా.. కుమారుడు శిఖర్ సింగ్, కుమార్తె ఖుషీ సింగ్‌ మృతదేహాలు వేర్వేరు గదుల్లో రక్తపు మడుగులో పడి ఉన్నాయి. భార్యను గొంతునులిమి హత్య చేసిన నిందితుడు.. కుమారుడు, కుమార్తెను సుత్తితో కొట్టి హతమార్చాడు. అయితే ఇలా హత్య చేయడానికి ముందు సుశీల్ భార్య, పిల్లలకు టీలో మత్తు మందు ఇచ్చినట్లు తెలుస్తోంది.  కరోనా ఎవరినీ వదలదు.. మృతదేహాలను లెక్కించి విసిగిపోయా.. ఓమిక్రాన్ ఎవరినీ వదలదు.. అందుకనే నా కుటుంబం మొత్తానికి విముక్తి కలిగించా అంటూ సునీల్ కు మెసేజ్ చేశాడు. పరారీలో ఉన్న సుశీల్ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. తన సోదరుడు సునీల్ కు  మెసేజ్ లు పంపించిన అనంతరం సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Also Read: ఇండోనేషియాలో మళ్ళీ భారీ భూకంపం.. ఎటువంటి సునామీ హెచ్చరికలు లేవన్న అధికారులు