AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rosaiah Funerals: గాంధీ భవన్‌కు మాజీ సీఎం రోశయ్య పార్థివదేహాం.. ఇవాళ దేవరయాంజల్‌ ఫాంహౌస్‌లో అంత్యక్రియలు..!

రోశయ్య పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు పలువురు ప్రముఖులు. కాగా, రోశయ్య అంత్యక్రియలు నేడు హైదరాబాద్‌ శివారులో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.

Rosaiah Funerals: గాంధీ భవన్‌కు మాజీ సీఎం రోశయ్య పార్థివదేహాం.. ఇవాళ దేవరయాంజల్‌ ఫాంహౌస్‌లో అంత్యక్రియలు..!
Rosaiah
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 05, 2021 | 10:19 AM

Rosaiah Funerals at Hyderabad: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. రోశయ్య పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు పలువురు ప్రముఖులు. కాగా, రోశయ్య అంత్యక్రియలు నేడు హైదరాబాద్‌ శివారులో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఉదయం 11 గంటలకు గాంధీభవన్ కు తరలించనున్నారు. అక్కడ కొద్దిసేపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సందర్శనార్థం ఉంచుతారు. మధ్యాహ్నం 12 గంటలకు గాంధీభవన్ నుంచి అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు కొంపల్లి ఫాంహౌస్ లో రోశయ్య అంత్యక్రియలు జరుగుతాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రోశయ్య అంత్యక్రియలకు మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరుకానున్నారు. ఆర్థికశాఖ అంటే రోశయ్యగారేనన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రోశయ్య లేని లోటు ఎవరూ తీర్చలేనిదన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రోశయ్య మృతిపట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన బౌతిక కాయం వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం నివాళులర్పించారు. రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని ఆయన చెప్పారు. తాను విద్యార్ధిగా ఉన్న సమయంలో బీజేపీ సీనియర్ నేత వి. రామారావు శాసనమండలి సభ్యుడిగా ఉన్న సమయంలో మండలికి వెళ్లేవాడినని కిషన్ రెడ్డి చెప్పారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కవచంగా రోశయ్య పనిచేశారని కిషన్ రెడ్డి చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో కూడా రోశయ్యతో కలిసి అసెంబ్లీలో ప్రతి రోజూ కలిసేవాడినని చెప్పారు. అసెంబ్లీలోనూ వ్యక్తిగతంగా తాను లేవనెత్తే అంశాలపై రోశయ్య అభినందించేవాడని కిషన్ రెడ్డి ప్రస్తావించారు.. ఆర్థిక శాఖ అంటే రోశయ్యే గుర్తుకొస్తాయని తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ అన్నారు. విపక్షాన్ని తన మాటలతోనే ఆకట్టుకునే నేర్పరి రోశయ్యని..రాజకీయాల్లో ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిదన్నారు. రోశయ్య ఆత్మశాంతికి కలగాలని కోరుకొంటున్నానని తెలిపారు. రోశయ్య . కుటుంబానికి దేవుడు మనో ధైర్యం కలిగించాలని కోరుకొంటున్నట్టుగా సంజయ్ చెప్పారు.

ఇక, సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న రోశయ్యను..ఎన్నో పదవులు వరించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎం, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆర్థికమంత్రిగా 15 సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో కీలక పదవులు చేపట్టి అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న రోశయ్య మృతితో..రెండు తెలుగు ప్రభుత్వాలు మూడు రోజులు సంతాపదినాలుగా ప్రకటించాయి. రోశయ్య మరణాన్ని ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతో ఉన్న అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. రాజకీయాలకు అతీతంగా రోశయ్య మరణం పట్ల ప్రముఖుల సంతాపం తెలుపుతున్నారు.

Read Also…  Nagaland Tension: నాగాలాండ్‌లో భద్రతా దళాల కాల్పులు.. 14మంది సాధారణ పౌరుల దుర్మరణం!