Omicron Effect : ఆర్టీసీలో కొత్త రూల్స్.. బస్సు ఎక్కాలంటే అది తప్పనిసరి.. ఆదేశాలు జారీ చేసిన సజ్జనార్

TSRTC New Rules: ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. మనదేశంలోనూ పంజా విసురుతోంది. ఇప్పటికే దేశంలో నాలుగు కేసులు వెలుగుచూశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.

Omicron Effect : ఆర్టీసీలో కొత్త రూల్స్.. బస్సు ఎక్కాలంటే అది తప్పనిసరి.. ఆదేశాలు జారీ చేసిన సజ్జనార్
Tsrtc
Follow us

|

Updated on: Dec 05, 2021 | 9:34 AM

TSRTC New Rules: ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. మనదేశంలోనూ పంజా విసురుతోంది. ఇప్పటికే దేశంలో నాలుగు కేసులు వెలుగుచూశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఈమేరకు తెలంగాణ ఆర్టీసీ ముందస్తు చర్యల్లో నిమగ్నమైంది. కొత్త నిబంధనలు సిద్ధం చేశారు. నూతన రూల్స్‌కు సంబంధించిన ఉత్తర్వులను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విడుదల చేశారు.

ఈ నూతన నిబంధనల మేరకు బస్సులో ప్రయాణించే పాసింజర్లకు మాస్క్ తప్పని సరి చేశారు. మాస్స్ ఉంటేనే బస్సులోకి ఎంట్రీ చేయనున్నారు. కండక్టర్ తో పాటు డ్రైవర్ కూడా తప్పని సరిగా మాస్క్ ధరించాలని అందులో పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సులను బస్సుని శానిటైజ్ చేయడంతో పాటు శానిటైజర్ బాటిళ్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తిపై అన్ని బస్టాండ్‌లు, బస్‌ స్టాప్‌లలో మైక్ లతో ప్రయాణికులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. బస్టాండ్‌లలో ఉన్న రెస్ట్ రూంలలో సబ్బులను, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటూ, ఆర్టీసీ ప్రగతికి తోడ్పాలని సజ్జనార్ అధికారులను ఆదేశించారు.

Also Read: Akhanda – Bulls: ‘అఖండ’లో కనిపించే ఆ గిత్తలు తెలంగాణవే.. వాటి ప్రత్యేక ఏంటో తెలుసా?.. ఆసక్తికర విశేషాలు మీకోసం..!

NV Ramana – Telugu: తెలుగు భాష తన ఔన్నత్యాన్ని కోల్పోతోంది.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సీజేఐ ఎన్‌వి రమణ..