Akhanda – Bulls: ‘అఖండ’లో కనిపించే ఆ గిత్తలు తెలంగాణవే.. వాటి ప్రత్యేక ఏంటో తెలుసా?.. ఆసక్తికర విశేషాలు మీకోసం..!
Akhanda - Bulls: నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి రెండు గిత్తలు. సినిమా మొదట్లోనే అవి పరుగెత్తుకుంటూ రావడం చూస్తే
Akhanda – Bulls: నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి రెండు గిత్తలు. సినిమా మొదట్లోనే అవి పరుగెత్తుకుంటూ రావడం చూస్తే ఎవరికైనా గూస్‌బమ్స్ రావడం ఖాయం. అయితే ఈ గిత్తల ప్రత్యేకత ఏంటి? ఇవి ఏ ప్రాంతానికి చెందినవో తెలుసుకుందాం… నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వచ్చిన అఖండ సినిమా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ మూవీలో రెండు గిత్తల ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాలో బాలకృష్ణ ఎంట్రీ సమయంలో తిరిగి మూవీ క్లైమాక్స్‌లో ఈ రెండు గిత్తలు కీలక సమయాల్లో ఎంట్రీ ఇచ్చి కథకు మరింత బలాన్ని చేకూర్చాయి. నమ్మిన బంట్లుగా, యజమానికి ఆపదొస్తే ఆదుకునేలా, కష్టంలో ఉన్నప్పుడు మేమున్నామంటూ గిత్తల ప్రదర్శన అఖండ సినిమాలో హైలైట్ గా నిలిచింది.
అయితే ఈ మూవీలో ఉన్న ఈ రెండు గిత్తలు తెలంగాణకు చెందినవి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని లక్కారం గ్రామానికి చెందిన ఆర్గానిక్ రైతు శ్రీనివాస్ యాదవ్ కి చెందినవి ఈ గిత్తలు. ప్రత్యేక శిక్షణ ఇస్తే వెంటనే అర్థం చేసుకోవడం ఈ గిత్తల ప్రత్యేకత. అందుకే అఖండ సినిమాలో కూడా డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ గిత్తలకు శిక్షణ ఇచ్చి మూవీలో మంచి సీన్ల కోసం అద్భుతంగా వాడుకున్నాడు. మూడు సంవత్సరాల వయసు గల రెండు కోడెలను తాము కృష్ణార్జునులు అని పిలుస్తామని, పదహారు నెలల వయసులో తమ వ్యవసాయ క్షేత్రనికి తీసుకు వచ్చామని వీటి యజమాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. కాగా, తమ రెండు గిత్తలు నటించిన అఖండ మూవీ ఘన విజయం సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు శ్రీనివాస్‌యాదవ్.
Also read:
Omicron Tension: ఒమిక్రాన్ భయం.. ఆటోమొబైల్..ఎలక్ట్రానిక్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే..
Corona Tension: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసిన మంగోలియా ప్రతినిధి బృందంలో కరోనా కలకలం