Megastar Chiranjeevi: నేడు గడి కోట సంస్థానానికి మెగాస్టార్ చిరంజీవి సహా కుటుంబ సభ్యులు.. భారీ బందోబస్తు ఏర్పాటు..

Megastar Chiranjeevi: గడి కోట సంస్థానాధీశుల కామినేని అనిల్ కుమార్ శోభన రెండో కూతురు అనుష్పాల వివాహం సందర్భంగా దోమకొండలో పోచమ్మ పండగ నిర్వహించనున్నారు. ఈ రోజు కామారెడ్డి..

Megastar Chiranjeevi: నేడు గడి కోట సంస్థానానికి మెగాస్టార్ చిరంజీవి సహా కుటుంబ సభ్యులు.. భారీ బందోబస్తు ఏర్పాటు..
Mega Family
Follow us
Surya Kala

|

Updated on: Dec 05, 2021 | 11:10 AM

Megastar Chiranjeevi: గడి కోట సంస్థానాధీశుల కామినేని అనిల్ కుమార్ శోభన రెండో కూతురు అనుష్పాల వివాహం సందర్భంగా దోమకొండలో పోచమ్మ పండగ నిర్వహించనున్నారు. ఈ రోజు కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండల కేంద్రంలోని గడికోటలో  మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యామిలీ పర్యటించనుంది.  ఈరోజు మెగాస్టార్ చిరంజీవి సహా రామ్ చరణ్, ఉపాసన, కుటుంబ సభ్యులు కూడా గడికోటకు వెళ్లనున్నారు.

మెగాస్టార్ రామ్ చరణ్ మరదలు.. ఉపాసన చెల్లెలు అనుష్పాల వివాహ సందర్భంగా పోచమ్మ పండుగ కు  చిరంజీవి ఫ్యామిలీ తో పాటు, కామినేని అపోలో కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. దీంతో ఇప్పటికే గడి కోట వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరోవైపు అనుష్పాల పెళ్లి వేడుకలు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం కొత్త జంటను ఆశీర్వదించడానికి హిజ్రాలు విచ్చేసిన సంగతి తేలింది. ఉపాసన చెల్లి అనుష్పాల తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడ బోతోంది.  అనుష్పాల చెన్నైకి చెందిన కార్ రేసర్ అర్మాన్ ఇబ్రహీంని పెళ్లాడుతోంది.

రేసర్ అర్మన్‌ ఇబ్రహీం-అనుష్పాల కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. మాజీ ఇండియన్‌ ఎఫ్‌ 3 ఛాంపియన్‌ అక్బర్‌ ఇబ్రహీం తనయుడే అర్మన్‌ ఇబ్రహీం. కార్‌ రేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అర్మాన్ ఇబ్రహీం తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని కార్ రేసర్ గా ప్రతిభను నిరూపించుకుని పాపులారిటీ సంపాదించాడు. కారు రేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఇక అనుష్పాల అపోలో సంస్థల కార్యకలాపాల్లో ఉపాసనతో పాటు బిజీబిజీగా ఉంటారు. అపోలో గ్రూప్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి.. దోమకొండ కోటకు చెందిన ఉమాపతి రావులకు అనుష్పాల మనవరాలు. శోభన- అనిల్ కామినేనిల రెండో కూతురు.

Also Read: ఉప్పాడ తీరం వద్ద ఎగసి పడుతున్న అలలు.. సముద్రంలోకి కొట్టుకుపోతున్న ఇల్లు, కొబ్బరి చెట్లు..