Uppada: ఉప్పాడ తీరం వద్ద ఎగసి పడుతున్న అలలు.. సముద్రంలోకి కొట్టుకుపోతున్న ఇల్లు, కొబ్బరి చెట్లు..

Uppada: ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్రలో పాటు, గోదావరి జిల్లాలకు జవాద్ తుఫాన్ గండం అని హెచ్చరించిన నేపథ్యంలో ప్రజల్లో భయభ్రాంతులు నెలకొన్నాయి. అయితే..

Uppada: ఉప్పాడ తీరం వద్ద ఎగసి పడుతున్న అలలు.. సముద్రంలోకి కొట్టుకుపోతున్న ఇల్లు, కొబ్బరి చెట్లు..
Uppada Beach
Follow us

|

Updated on: Dec 05, 2021 | 10:35 AM

Uppada: ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్రలో పాటు, గోదావరి జిల్లాలకు జవాద్ తుఫాన్ గండం అని హెచ్చరించిన నేపథ్యంలో ప్రజల్లో భయభ్రాంతులు నెలకొన్నాయి. అయితే ఏపీకి జవాద్ తూఫాన్ గండం తప్పింది. దీంతో ప్రభుత్వం, అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. రాత్రి నుండి ఉప్పాడ తీరం వెంబడి అలలతాకిడి అధికంగా ఉంది. జవాద్ తూఫాన్ .. దీనికి తోడు అమావాస్య తోడుకావడంతో సముద్రంలోని కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. ఉవ్వెత్తున్న విరుచుకు పడుతున్న అలల తాకిడికి ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసమయింది.

ఉప్పాడ-కాకినాడ ప్రధాన రహదారిలో పెద్ద బ్రిడ్జి కూలెందుకు సిద్దంగా ఉంది. దీంతో వాహనాల రాకపోకలకు ప్రమాదం పొంచి ఉంది. తీవ్ర అలల తాకిడికి  పెద్ద బ్రిడ్జ్ ఒక పక్కకు ఒరిగింది. మరోవైపు బ్రిడ్జి రక్షణ గోడలకు బీటలు వారాయి.  అధికారులు అప్రమత్తమయ్యి వెంటనే బ్రిడ్జి మీద నుంచి భారీ వాహనాలు రాకపోకలు నిలిపివేయక పోతే బ్రిడ్జి కూలిపోయో ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సముద్రం అలల తాకిడికి ఉప్పాడ మార్కేట్ సెంటర్, మాయాపట్నం, కోనపా పేట వద్ద తీరం కోతకు గురవుతుంది. సముద్రం సమీపంలోని ఇల్లు, కొబ్బరి చెట్లు సముద్రంలో కలిసిపోతున్నాయి.

`

Also Read:  కార్తీకమాసం చివరి రోజు.. పోలి స్వర్గం కథ విన్నా.. ఒక్క దీపం వెలిగించినా.. అష్టైశ్వర్యాలు..