Karthika Masam: కార్తీకమాసం చివరి రోజు.. పోలి స్వర్గం కథ విన్నా.. ఒక్క దీపం వెలిగించినా.. అష్టైశ్వర్యాలు..

Karthika Masam: హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కార్తీకమాసం. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసం విశిష్టత గురించి పురాణాల్లో కూడా ఉంది. అధ్యాత్మికంగా ఎంతో..

Karthika Masam: కార్తీకమాసం చివరి రోజు.. పోలి స్వర్గం కథ విన్నా.. ఒక్క దీపం వెలిగించినా.. అష్టైశ్వర్యాలు..
Karthika Masam Last Day
Follow us

|

Updated on: Dec 05, 2021 | 10:08 AM

Karthika Masam: హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కార్తీకమాసం. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసం విశిష్టత గురించి పురాణాల్లో కూడా ఉంది. అధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న కార్తీకమాసంలో నెల రోజుల పాటు నది స్నానం, శివాలయ దర్శనం, దానం వంటి కార్యక్రమాలను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈరోజు కార్తీక మాసం చివరి రోజు.. దీంతో అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది.. ‘పోలిస్వర్గం’ కథ.. కార్తీకమాసం చివరి రోజు సందర్భంగా పోలి స్వర్గం కథ తెలుసుకుందాం..

అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం.. ఆ కుటుంబంలో ఐదుగురుకొడుకులు ఐదుగురు కోడళ్లు ఉండేవారు. వారిలో చిన్న కోడలు పోలి.. ఆమెకి చిన్నతనం నుంచి దైవం అంటే భక్తి.. పూజలు వ్రతలన్నా మహా ఆసక్తి.. అయితే అత్తగారికి చిన్న కోడలు పోలి అంటే అసూయ తాను మాత్రమే భక్తురాలనే నమ్మకం. అహంభావం.. దీంతో కార్తికమాసంలో తన నలుగురు కోడళ్ళు తీసుకుని అత్తగారు రోజూ నది స్నానమాచరించి.. దీపాలు వెలిగించి వచ్చేది. అంతేకాదు ఎక్కడ పోలి నది స్నానము చేసి దీపం వెలిగిస్తుందో.. అని అనుమానంతో దీపం పెట్టేందుకు కావల్సిన సామాగ్రి ఇంట్లో లేకుండా చేసి అత్తగారు మిగిలిన కోడళ్లతో వెళ్ళేది. అయితే పోలి పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తిని చేసి.. కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేంది. తాను పెట్టిన దీపం ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు, దాని మీద బుట్టని బోర్లించేంది. ఇలా కార్తికమాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి.

కార్తీకమాసం చివరికి అమావాస్య రోజున నదీస్నానం చేసి ఘనంగా కార్తికదీపాలను వదిలేందుకు అత్తగారు తన నలుగురు కోడళ్లతో కలిసి బయల్దేరింది. వెళ్తూ.. పోలికి ఇంటి పనులన్నీ అప్పగించి వెళ్ళింది. పోలి ఎప్పటిలాగే ఇంటిపనులను చకచకా ముగించేసుకుని కార్తిక దీపాన్ని వెలిగించుకుంది. పోలి తనకు వచ్చిన అవాంతరాలను అధిగమించి దీపం పెట్టిన భక్తి దేవతలను ఆకర్షించింది. దీంతో పోలిని బొందితో స్వర్గానికి తీస్కుని వెళ్ళడానికి విమానం వచ్చింది. అయితే ఆ విమానాన్ని చూసిన అత్తగారు, నలుగురు కోడళ్ళు తమకోసమే అనుకుని సంతోషపడ్డారు. అయితే ఆ విమానంలో పోలి కనిపించడంతో ఆశ్చర్యపోయారు. అయితే పోలితో పాటు తాముకూడా వెళ్లాలని.. ఆమె కాళ్ళు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆ ప్రయత్నం ఫలించలేదు. విమానంలోని దేవదూతలు, పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెప్పి.. వారిని కిందకు దించేశారు.

ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తల్చుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటిదొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఈ రోజున పోలి కథను చెప్పుకుని బ్రహ్మణులకు దీపాన్ని లేదా స్వయంపాకాన్ని దానం చేస్తారు.

Also Read:   కరోనా వెలుగులోకి వచ్చిన రెండేళ్లకు ఆ దేశంలో మొదటి కేసు నమోదు.. ప్రభుత్వం అలెర్ట్..

Latest Articles
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.