Pooja Hegde: ఇల్లు కట్టుకోవడమే ఇంత కష్టంగా ఉంటే.. పెళ్లి ఎలా ఉంటుందో.. మ్యారేజ్‌పై బుట్టబొమ్మ వ్యాఖ్యలు.

Pooja Hegde: ఇల్లు, పెళ్లి.. ఈ రెండింటికి జీవితంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అందుకే 'ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు' అని అంటుంటారు. ఇల్లు, పెళ్లి ఈ రెండు ఉంటేనే జీతం సంపూర్ణం అనే భావనలో ఉంటారు....

Pooja Hegde: ఇల్లు కట్టుకోవడమే ఇంత కష్టంగా ఉంటే.. పెళ్లి ఎలా ఉంటుందో.. మ్యారేజ్‌పై బుట్టబొమ్మ వ్యాఖ్యలు.
ప్రస్తుతానికి మహేష్ - త్రివిక్రమ్ మూవీ తప్ప ఇంకేదీ తన ఖాతాలో లేదు. ఈ సినిమా సెట్స్ కెళ్లేందుకు ఇంకా చాలా సమయం పడుతుంది. అందువల్ల పూజాకి బోలెడంత తీరిక సమయం చిక్కింది. ఈ సమయంలో పూర్తిగా కుటుంబంతోనే టైమ్ స్పెండ్ చేస్తోందట
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 05, 2021 | 9:27 AM

Pooja Hegde: ఇల్లు, పెళ్లి.. ఈ రెండింటికి జీవితంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ‘ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు’ అని అంటుంటారు. ఇల్లు, పెళ్లి ఈ రెండు ఉంటేనే జీతం సంపూర్ణం అనే భావనలో ఉంటారు. అయితే ఇది కేవలం సామాన్య ప్రజలకే పరిమితం కాకుండా రూ. కోట్లలో రెమ్యునరేషన్‌ తీసుకునే సెలబ్రిటీలకు సైతం వర్తిస్తుంది. ఎన్ని కోట్లు సంపాదించినా ఓ మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి అమ్మాయి/ అబ్బాయిని పెళ్లి చేసుకోని సెటిల్‌ అవ్వాలనుకుంటారు. తాజాగా అందాల తార పూజా హెగ్డే కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వివాహంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిందీ బ్యూటీ.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

ఈ సందర్భంగా వివాహ బంధం గురించి మీ అభిప్రాయం ఏంటన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా ఈ అందాల తార మాట్లాడుతూ.. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు ఉంటారు. ఎందుకంటే అవి చేసిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఇటీవలే ముంబయిలో ఓ ఇంటిని నిర్మించుకున్నాను. ఇల్లు కట్టుకోవడమే ఇంత కష్టంగా ఉంటే పెళ్లి ఎలా ఉంటుందోనని నవ్వుతూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ. ఇక జీవితాంతం కలిసి ఉంటే బాగుంటదనిపించే వారినే పెళ్లి చేసుకోవాలని చెప్పిన ఈ బ్యూటీ.. ఇంట్లో ఒత్తిడి వల్లో, అందరూ పెళ్లి చేసేసుకుంటున్నారనో మాత్రం చేసుకోకూడదని ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌కు సూచన చేసింది.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

అయితే తన పెళ్లి ఎప్పుడన్న విషయం మాత్రం దాటేసింది. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని, ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా చాలా బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. ఇదిలా ఉంటే ఈ అందాల తార ప్రస్తుతం ఆచార్య, రాధేశ్యామ్‌, బీస్ట్‌ వంటి భారీ బడ్జెట్‌ చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమాలు విజయవంతమైతే ఈ అమ్మడి క్రేజ్‌ ఒక్కసారి ఆకాశాన్ని తాకుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read: అఘోరీ, అఘోరా కల్యాణం.. అర్ధరాత్రి ముహూర్తం !! వీడియో

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి స్త్రీవలన ధన లాభం ఉంటుంది.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Karnataka Minister: లంచం తీసుకుంటూ కొందరు పోలీసులు కుక్కల్లా నిద్రపోతారు.. కర్ణాటక హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు!