- Telugu News Photo Gallery Cinema photos Actress Payal Rajput Birthday Today. On This Know some things About her
Payal Rajput: కుర్రాళ్ల గుండెల్లో ఆర్‌డీఎక్స్ బాంబ్ పేల్చిన అందాల తార.. పాయల్ రాజ్‌పుత్ పుట్టిన రోజు నేడు..
Payal Rajput: ఆర్‌ఎక్స్ 100 సినిమాతో ఓ సంచలనంగా దూసుకొచ్చింది అందాల తార పాయల్ రాజ్‌పుత్. కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియా ద్వారా నిత్యం అభిమానులకు చేరువయ్యే ఈ బ్యూటీ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా..
Updated on: Dec 05, 2021 | 8:48 AM

టెలివిజన్ నటిగా కెరీర్ మొదలు పెట్టి.. 2017లో 'చన్నా మెరేయా' అనే పంజాబి చిత్రంతో వెండితెరకు పరిచయమైంది అందాల తార పాయల్ రాజ్‌పుత్. రెండో చిత్రంతోనే బాలీవుడ్‌లో అడుగు పెట్టిందీ బ్యూటీ.

ఇక 2018లో వచ్చిన 'ఆర్‌ఎక్స్ 100' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన పాయల్.. తొలి సినిమాతోనే కుర్రాళ్లు హృదయాలను కొల్ల గొట్టింది. పాయల్ పుట్టిన రోజు నేడు. ఈ అందాల తార 1992 డిసెంబర్ 5న ఢిల్లీలో జన్మించింది.

ఓ వైపు అందం మరోవైపు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి తెలుగు ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసింది. అనంతరం వెంకీమామ, డిస్కో రాజా వంటి బడా చిత్రాల్లో సైతం నటిస్తూ దూసుకుపోతోంది.

సినిమాలే కాకుండా ఆహా ఓటీటీలో విడదులైన '3 రోజెస్'తో వెబ్‌సిరీస్‌లోనూ నటించింది. ఇక పాయల్ సినిమాలతో ఎంత పేరు సంపాదించుకుందో, సోషల్ మీడియాలో ద్వారా అంతే క్రేజ్ సంపాదించుకుంది. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతోందీ బ్యూటీ.

మరి పాయల్ రాజ్‌పుత్ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మనం కూడా పాయల్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేద్దామా.!





























