WWW movie: శివాత్మిక రెండో చిత్రం కూడా ఓటీటీలోనే.. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు ఎందులో రానుందంటే..

WWW movie: రాజశేఖర్‌ కూతురు శివాత్మిక నటించిన తొలి చిత్రం 'అద్భుతం' ఎట్టకేలకు విడుదలైన విషయం తెలిసిందే. నిజానికి శివాత్మిక అంతకు ముందు రెండు చిత్రాల్లో నటించినప్పటికీ అవి మధ్యలోనే..

WWW movie: శివాత్మిక రెండో చిత్రం కూడా ఓటీటీలోనే.. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు ఎందులో రానుందంటే..
Www Moive
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 05, 2021 | 11:41 AM

WWW movie: రాజశేఖర్‌ కూతురు శివాత్మిక నటించిన తొలి చిత్రం ‘అద్భుతం’ ఎట్టకేలకు విడుదలైన విషయం తెలిసిందే. నిజానికి శివాత్మిక అంతకు ముందు రెండు చిత్రాల్లో నటించినప్పటికీ అవి మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో అద్ధుతమే శివాత్మిక తొలి చిత్రంగా వచ్చింది. ఇక ఈ సినిమాను మేకర్స్‌ ఓటీటీ వేదికగా విడుదల చేసిన విషయం తెలిసిందే. రెండు విభిన్న కాలాల మధ్య ఉండే వారి మధ్యలో చిగురించే ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా శివాత్మిక రెండో చిత్రం కూడా ఓటీటీలోనే విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కేవి గుహన్‌ దర్శకత్వం వచ్చిన ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు (ఎవరు, ఎక్కడ, ఎందుకు)’ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ ‘సోని లివ్‌’లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. సోనీ సంస్థ ఫ్యాన్సీ ధరకు ఈ సినిమా డిజిటల్‌ హక్కులను దక్కించున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సోని లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. కంప్యూటర్ స్క్రీన్‌ బేస్డ్‌ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అదిత్‌ అరుణ్‌, శివాని రాజశేకర్‌ జంటగా నటించారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది.

అయితే తాజాగా ఓటీటీతో మంచి డీల్‌ కుదరడంతో చిత్ర యూనిట్‌ ఇందుకు మొగ్గుచూపినట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్‌, ఫస్ట్‌లుక్‌లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. శివాత్మిక తొలి రెండు చిత్రాలు వినూత్న కథాంశంతో తెరకెక్కుతుండడం విశేషం.

Also Read: IND vs NZ, 2nd Test, Day 2 Live Updates: ఆధిక్యంలో దూసుకుపోతున్న టీమిండియా.. న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్?

Payal Rajput: కుర్రాళ్ల గుండెల్లో ఆర్‌డీఎక్స్‌ బాంబ్‌ పేల్చిన అందాల తార.. పాయల్‌ రాజ్‌పుత్‌ పుట్టిన రోజు నేడు..

Snow Fall: మంచు దుప్పటి కప్పుకున్న బద్రినాథ్ ఆలయం.. వెన్నెల సోయగంతో హిమాచల్