AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Entertainment: బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ అవార్డు దక్కించుకున్న పురుషోత్తమాచార్యులు

69 వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో.. తెలుగు సినీ పరిశ్రమకు అవార్డుల పంట పండింది. జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డుతో పాటు 11 అవార్డులను గెలుచుకుంది. ఇందులో బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ అవార్డు పురుషోత్తమా చార్యులకు దక్కింది. అసలు పురుషోత్తమా చార్యులు ..? ఎవరు..? తెలుసు కోవాలంటే... ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే 69 వ నేషనల్ అవార్డ్స్ ను 2021 సంవత్సరంలో వచ్చిన సినిమాలకు గాను ప్రభుత్వం ప్రకటించింది.

Entertainment: బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ అవార్డు దక్కించుకున్న పురుషోత్తమాచార్యులు
Purushottamacharyulu
M Revan Reddy
| Edited By: |

Updated on: Aug 25, 2023 | 2:26 PM

Share

69 వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో.. తెలుగు సినీ పరిశ్రమకు అవార్డుల పంట పండింది. జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డుతో పాటు 11 అవార్డులను గెలుచుకుంది. ఇందులో బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ అవార్డు పురుషోత్తమా చార్యులకు దక్కింది. అసలు పురుషోత్తమా చార్యులు ..? ఎవరు..? తెలుసు కోవాలంటే… ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే 69 వ నేషనల్ అవార్డ్స్ ను 2021 సంవత్సరంలో వచ్చిన సినిమాలకు గాను ప్రభుత్వం ప్రకటించింది. వివిధ కేటగిరీల్లో తెలుగు చిత్ర పరిశ్రమ సత్తా చాటింది. ఈ నేపథ్యంలోనే 2021 సంవత్సరం బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ గా పురుషోత్తమా చార్యులు అని ప్రకటించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం బూరుగుగడ్డకు చెందిన పురుషోత్తమా చార్యులు ఎంఏ పిహెచ్ డీ చేశారు. నల్లగొండలోనీ రామగిరి గీతా విజ్ఞాన్ మందిర్ పాఠశాలలో తెలుగు పండిట్‎గా పనిచేసిన ఆయన పదవీ విరమణ పొందారు.

చందాల కేశవ దాస్ సాహిత్యంపై పురుషోత్తమాచార్యులు పరిశోధన చేశారు. తెలుగు పండిట్‎గా పురుషోత్తమాచార్యులు అనేక రచనలు చేశారు. తెలుగు చిత్రాల్లో శాస్త్రీయ సంగీతంపై ఆయన రాసిన వ్యాసాలు 2021లో మిష్మీ పత్రిక సీరియల్ గా ప్రచురించింది. ఆయన రాసిన వ్యాసాలకు జాతీయ ఉత్తమ సినీ విమర్శకుడు అవార్డును కేంద్రం ప్రకటించింది. పురుషోత్తమా చార్యులు టీటీడీ అన్నమాచార్య సంకీర్తన ప్రచార సమితి నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్ గా ఉన్నారు. ప్రతి నెల 16వ తేదీన అన్నమాచార్య సంకీర్తనల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీనితో పాటు ప్రతి ఏటా త్యాగరాయ, అన్నమాచార్య జయంతులను ఆయన నిర్వహిస్తారు.

బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ అవార్డు రావడంతో పురుషోత్తమా చార్యులను కవులు, కళాకారులు, సాహితీ వేత్తలు, అభిమానులు అభినందిస్తున్నారు. తెలంగాణలో తెలుగు భాషపై మొట్టమొదటి అవార్డు నాకు దక్కడం గర్వకారణంగా ఉందని పురుషోత్తమాచార్యులు అన్నారు. జాతీయ అవార్డు రావడం నా జీవితంలో సువర్ణ అధ్యాయమని, గొప్ప గొప్ప సాహితీవేత్తలు సినీ విమర్శకుల మధ్య నాకు ఈ అవార్డు దక్కడం సంతోషంగా ఉందని అన్నారు. తెలుగు చిత్రాల్లో శాస్త్రీయ సంగీతం అనే అంశాన్ని ఎవరు సృశించకపోవడంతో ఈ అవార్డు దక్కిందని పురుషోత్తమాచార్యులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే తెలుగు సిని పరిశ్రమకు అవార్డులు రావడం పట్ల సిని ప్రముఖులతో సహా.. రాజకీయననాయకులు సైతం అవార్డులు దక్కించుకున్నవారికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక అభిమానులైతే తాము నటులు, కళాకారులకు రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇప్పటివరకు టాలివుడ్‌లో ఎవరూ దక్కించుకోని ఉత్తమ నటుడు అవార్డు అల్లు అర్జున్ దక్కించుకోవడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే