- Telugu News Photo Gallery Cinema photos Actress Aditi Rao Hyderi Shares Traditional Look Photos On Social Media Goes Viral
Aditi Rao Hydari: ట్రెడిషినల్ లుక్‌లో తళుక్కుమన్న అందాల తార.. అదితి లేటెస్ట్ ఫొటోస్ చూశారా.?
సమ్మోహనం లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత అంతరిక్షం 9000 KMPH, వీ, మహా సముద్రం సినిమాల్లో నటించింది అదితి. తన క్యూటి యాక్టింగ్ తో ఇక్కడి ప్రేక్షకులకు బాగా చేరువైంది. వీటితో పాటు ఆమె నటించిన పలు తమిళ్, మలయాళ సినిమాలు కూడా తెలుగులోకి డబ్బింగ్ అవుతున్నాయి.
Updated on: Aug 25, 2023 | 3:37 PM

అదితి రావ్ హైదరి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్‌లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు సమ్మోహనం సినిమాతో టాలీవుడ్‌ను పలకరించింది. మొదటి సినిమాలోనే తన క్యూట్ యాక్టింగ్‌తో అందరినీ ఆకట్టుకుంది.

సమ్మోహనం తర్వాత అంతరిక్షం 9000 KMPH, వీ, మహా సముద్రం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. అలాగే ఆమె నటించిన పలు తమిళ్, మలయాళ సినిమాలు కూడా తెలుగులోకి డబ్బింగ్ అవుతున్నాయి.

సినిమాల సంగతి పక్కన పెడితే.. అదితీ రావ్ హైదరీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన అభిమానుల కోసం తరచూ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూనే ఉంటుంది. సుమారు కోటి మందికి పైగా సోషల్ మీడియాలో అదితిని ఫాలో అవుతున్నారు. దీన్ని బట్టే చెప్పవచ్చు నెట్టింట ఆమె ఎంత క్రేజ్ ఉందో.

తాజాగా మరిన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది అదితి రావ్ హైదరీ. ఇందులో ట్రెడిషనల్ లుక్ లో అందరి దృష్టిని ఆకర్షించిందీ అందాల తార. తన లేటెస్ట్ ఫొటోస్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నాయి. ఫాలోవర్ల నుంచి లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది.

అదితీ రావ్ చివరిగా 'హే సినామిక' అనే సినిమాలో నటించింది. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే అదితీ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం రెండు సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లోనూ నటిస్తూ బిజీబిజీగా ఉంటోందీ అందాల తార.




