- Telugu News Photo Gallery Cinema photos Kantara 2 Movie ready for shooting with 120 crores budget to release in 2024 Telugu Entertainment Photos
Kantara – 2: వామ్మో..! కాంతారా-2కి మరీ ఇంత బడ్జెట్ నా.! ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
2022లో బిగ్గెస్ట్ సెన్సేషన్ కాంతార. కన్నడ ఇండస్ట్రీలో చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ నేషనల్ లెవల్‌లో సంచలనాలు నమోదు చేసింది. దాదాపు భారతీయ భాషలన్నింటిలోనూ సూపర్ హిట్ కావటంతో ఈ సినిమా సీక్వెల్‌కు సంబంధించిన చర్చ మొదలైంది. తొలి భాగం సూపర్ హిట్ కావటంతో సీక్వెల్ కోసం భారీ బడ్జెట్ కేటాయించారట మేకర్స్. కన్నడ రూట్స్‌కు సంబంధించిన కథతో తెరకెక్కిన కాంతార..
Updated on: Aug 25, 2023 | 8:26 PM

2022లో బిగ్గెస్ట్ సెన్సేషన్ కాంతార. కన్నడ ఇండస్ట్రీలో చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ నేషనల్ లెవల్‌లో సంచలనాలు నమోదు చేసింది. దాదాపు భారతీయ భాషలన్నింటిలోనూ సూపర్ హిట్ కావటంతో ఈ సినిమా సీక్వెల్‌కు సంబంధించిన చర్చ మొదలైంది.

తొలి భాగం సూపర్ హిట్ కావటంతో సీక్వెల్ కోసం భారీ బడ్జెట్ కేటాయించారట మేకర్స్. కన్నడ రూట్స్‌కు సంబంధించిన కథతో తెరకెక్కిన కాంతార నేషనల్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ కోసం రిక్వెస్ట్‌లు కూడా వినిపించాయి.

అభిమానుల కోరిక మేరకు అన్నట్టుగా పార్ట్ 2ను ఎనౌన్స్ చేసింది యూనిట్. అందరూ ఊహించినట్టుగా సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్‌ను రాబోతుందని చెప్పి ట్విస్ట్ ఇచ్చింది టీమ్. కాంతార పాన్ ఇండియా సక్సెస్ కావటంతో మిగతా ప్రాజెక్ట్స్‌ను పక్కన పెట్టేసి ప్రీక్వెల్ మీదే దృష్టి పెట్టారు హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి.

ఆల్రెడీ పార్ట్ 2కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్‌కు వచ్చేయటంతో ప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌ను లో బడ్జెట్‌లో చిన్న సినిమాగా రూపొందించిన మేకర్స్, పార్ట్ 2ను మాత్రం భారీ బడ్జెట్‌తో బిగ్ స్కేల్‌లో ప్లాన్ చేస్తున్నారు.

కాంతార బడ్జెట్ జస్ట్ 16 కోట్లు. కానీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ నెంబర్స్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రీక్వెల్‌ను 120 కోట్లతో నిర్మించేందుకు రెడీ అయ్యారు.

త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాను 2024 సెకండ్ హాఫ్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా సీక్వెల్ కోసం సినీ ప్రేమికులు గట్టిగానే ఎదురుచూస్తున్నారు.




