Mahesh Babu: మహేష్- రాజమౌళి సినిమాలో ఆ పాన్ ఇండియా హీరో.. బాక్సాఫీస్ రికార్డులు గల్లంతే ఇక..
దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో కొందరు హాలీవుడ్ స్టార్స్ కూడా నటించనున్నారని తెలుస్తోంది. అలాగే ప్రియాంక చోప్రా కూడా ఫిక్స్ అయ్యిందంటున్నారు. తాజాగా SSMB 29 (వర్కింగ్ టైటిల్) సినిమా టీమ్‌లోకి మరో దక్షిణాది స్టార్ యాక్టర్ చేరినట్లు వార్తలొస్తున్నాయి.
రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కోసం ఇండియాలోనే కాదు ప్రపంచ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘RRR’ విడుదలకు ముందే మహేష్ బాబు, రాజమౌళి కొత్త సినిమాని ప్రకటించారు. కానీ ‘RRR’ సినిమా విడుదలై మూడేళ్లు కావస్తున్నా ఇప్పటికి కూడా రాజమౌళి-మహేష్ బాబు సినిమా సెట్ కాలేదు. అయితే ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అలాగే చాలా మంది పెద్ద స్టార్స్ ఈ సినిమాలో భాగం కానున్నట్లు తెలుస్తోంది. కాగా రాజమౌళి సినిమా ప్రీ-ప్రొడక్షన్‌లో పాలుపంచుకున్నారు. అలాగే సినిమా కోసం లొకేషన్ సెర్చ్, VFX, గ్రాఫిక్స్, ఇతర పనులు కూడా పూర్తి కావొచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నటీనటుల కోసం అన్వేషణ జరుగుతోందని, పలువురికి స్క్రీన్ టెస్టులు నిర్వహించి నటీనటులను ఎంపిక చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం హాలీవుడ్‌లో సెటిల్ అయిన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో నటించనుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ప్రియాంక చోప్రాతో పాటు సౌత్ కి చెందిన మరో స్టార్ యాక్టర్ లీడ్ రోల్ చేయనున్నాడని అంటున్నారు. ఆయనే మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్
మలయాళంతో పాటు ఇప్పటికే హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నటించారు పృథ్వీరాజ్ సుకుమారన్. స్టార్ నటుడు, దర్శకుడిగానూ సత్తా చాటిన అతను ఇప్పుడు రాజమౌళి, మహేష్ బాబుల సినిమాలో ప్రధాన పాత్ర పోషించనున్నాడని తెలుస్తోంది. ప్రభాస్ నటించిన ‘సలార్’ సినిమాలో పృథ్వీరాజ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
పృథ్వీరాజ్ సుకుమారన్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
కాగా ఎస్ ఎస్ ఎమ్ బీసినిమాలో ప్రముఖ హాలీవుడ్ నటుడు ‘థోర్’ ఫేమ్ క్రిస్ హెమ్స్‌వర్త్ నటించనున్నాడని సమాచారం. అంతే కాదు ఈ సినిమాలో హీరోయిన్ గా కూడా హాలీవుడ్ నటి ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. వీటిపై ఇంకా అధికారిక ప్రకటనలు వెలువడాల్సి ఉంది. కాగా ఈ సినిమా ముహూర్తం జనవరి నెలలో నిర్వహించనున్నట్టు సమాచారం. 2027లో సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం దాదాపు 1000 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో నిర్మించేందుకు రాజమౌళి రెడీ అవుతున్నారని సమాచారం.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం