Radhe Shyam: ప్రేమకు, విధికి మధ్య జరిగే యుద్ధం.. అంచనాలు పెంచేసిన రాధేశ్యామ్ రిలీజ్ ట్రైలర్..
Radhe Shyam Release Trailer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం రాధేశ్యామ్ (Radhe Shyam). పూజాహెగ్డే (Pooja Hegde) హీరోయిన్ గా నటిస్తోంది.
Radhe Shyam Release Trailer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం రాధేశ్యామ్ (Radhe Shyam). పూజాహెగ్డే (Pooja Hegde) హీరోయిన్ గా నటిస్తోంది. గోపీచంద్ తో జిల్ వంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించిన రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగానే విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు అన్నీ హంగులు పూర్తి చేసుకుని మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రబృందం. కాగా ఇది వరకే ఓ సారి ట్రైలర్ విడుదల చేసింది రాధేశ్యామ్ చిత్ర యూనిట్. అయితే సినిమా విడుదల వాయిదా పడటంతో రిలీజ్ ట్రైలర్‌ను బుధవారం విడుదల చేసింది.
ప్రేమ విషయంలో ఆదిత్య ప్రెడిక్షన్ తప్పు..
‘మనం ఆలోచిస్తామని భ్రమపడతాం. కానీ మన ఆలోచనలు కూడా ముందుగానే రాసిపెట్టుంటాయి’ అని ప్రభాస్ డైలాగులతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ‘ఇంకోసారి చెయ్యి చూడు’, నాకు రెండో సారి చెయ్యి చూడడం అలవాటు లేదు ‘ అంటూ జగపతిబాబు, ప్రభాస్ ల మధ్య వచ్చే డైలాగులు బాగా పేలాయి. అదేవిధంగా ట్రైలర్ చివరిలో ‘ప్రేమ విషయంలో ఆదిత్య ప్రెడిక్షన్ తప్పు’ అని పూజ చెప్పిన డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. కాగా ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో హస్తసాముద్రికుడిగా కనిపించనున్నారు. అతని ప్రేయసి ప్రేరణగా పూజా హెగ్డే కనిపించనుంది. 1970-80ల కాలం నాటి లవ్ స్టోరీగా తెరకెక్కింది. ప్రేమ, విధి మధ్య పోరాటంగా ఈ సినిమా ఉండనుంది. ఇప్పటికే విడుదలైన వీడియో సాంగ్స్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్లకు ప్రభాస్ అభిమానుల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. రొమాంటిక్ లవ్‌స్టోరీ అయినప్పటికీ యాక్షన్ సీక్వెన్స్ కూడా, ఊహించని ట్వి్స్టులతో సినిమా ఉంటుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. కాగా రాధేశ్యామ్ సినిమాకు జస్టిన్ ప్రభాకరణ్ బాణీలు సమకూరుస్తుండగా ఎస్. థమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.
Also Read:స్వదేశానికి విద్యార్థులు.. 4 భాషల్లో స్వాగతం పలికిన కేంద్ర మంత్రి.. వీడియో వైరల్
Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో గెలుపు ఎవరిది..? ముందే చెప్పేసిన బాబా వెంగా..
Sreemukhi: పరువాలతో సెగలు పుట్టిస్తున్న యాంకర్ శ్రీముఖి.. అదిరిన పిక్స్