స్వదేశానికి విద్యార్థులు.. 4 భాషల్లో స్వాగతం పలికిన కేంద్ర మంత్రి.. వీడియో వైరల్
ఉక్రెయిన్ నుంచి భారత్ కు చేరుకున్న విద్యార్థులకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Minister Smriti Irani) నాలుగు ప్రాంతీయ భాషల్లో స్వాగతం(Welcome) పలికారు. కేరళ విద్యార్థుల కోసం...
ఉక్రెయిన్ నుంచి భారత్ కు చేరుకున్న విద్యార్థులకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Minister Smriti Irani) నాలుగు ప్రాంతీయ భాషల్లో స్వాగతం(Welcome) పలికారు. కేరళ విద్యార్థుల కోసం మలయాళం, గుజరాత్ విద్యార్థులకు గుజరాతీలో, మహారాష్ట్ర విద్యార్థులకు మరాఠీ, పశ్చిమ బంగ విద్యార్థులకు బెంగాలీలో స్వాగత శుభాకాంక్షలు చెప్పారు. కేంద్ర మంత్రి తమ తమ ప్రాంతీయ భాషల్లో స్వాగతం పలకడం విద్యార్థులను సంతోషానికి గురిచేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం(Russia-Ukraine War) నేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం ఆపరేషన్ గంగ ప్రాజెక్టు చేపట్టింది. ఈ క్రమంలో ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి తీసుకువచ్చిన భారతీయులకు కేంద్ర మంత్రులు స్వాగతం పలికారు. విద్యార్థులకు స్వాగతం పలికి వారికి ధైర్యం చెప్పారు. జైహింద్, భారత్ మాతా కీ జై నినాదాలతో విద్యార్థులు విమానాల్లో హోరెత్తించారు.
‘మీ అందరికీ స్వాగతం! మీ కుటుంబాలు మీకోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. కాబట్టి నేను ఎక్కువ సమయం మిమ్మల్ని ఇక్కడే ఉంచాలనుకోవడం లేదు. కఠిన పరిస్థితుల్లోనూ మీరందరూ ఆదర్శప్రాయమైన ధైర్యం ప్రదర్శించారు. మిమ్మల్ని ఇక్కడికి సేఫ్ గా చేర్చిన విమాన సిబ్బందికి ధన్యవాదాలు చెప్పండి.’భారత్ మాతా కీ జై’ -స్మృతి ఇరానీ, కేంద్ర మంత్రి
#WATCH | Union Minister Smriti Irani welcomes Indians back home by speaking in regional languages on their return from war-torn #Ukraine pic.twitter.com/ZlfW39w6in
— ANI (@ANI) March 2, 2022
ఉక్రెయిన్‌లో సుమారు 16,000 మంది భారతీయ పౌరులు చిక్కుకున్నారు. వారి భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. వారికి అన్ని విధాలుగా సహాయం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. భారతీయుల సురక్షిత ప్రయాణం కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని మోడీ మాట్లాడారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయని అనుమానిస్తూ భారత ప్రభుత్వం ఫిబ్రవరి 15న ఉక్రెయిన్‌ను ఖాళీ చేయమని భారతీయులకు సలహా ఇచ్చింది. దాదాపు 2000 మంది భారతీయులు సలహాను అనుసరించి భారతదేశానికి తిరిగి వచ్చారు. మిగితా వారు ఉక్రెయిన్ ప్రభుత్వ హామీలను నమ్మి, అక్కడే ఉండిపోయారు. భారత పౌరులకు సలహాలు జారీ చేసేందుకు భారతీయ రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ కాంటాక్ట్ నంబర్‌లు, మెయిల్ ఐడీలు ఏర్పాటు చేసింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఉక్రెయిన్ నుంచి భారతీయ పౌరులను తరలించడానికి మోడీ ప్రభుత్వం “ఆపరేషన్ గంగ” ప్రాజెక్టును చేపట్టింది. ఉక్రెయిన్‌లో నివసిస్తున్న భారతీయ పౌరుల వివరాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంది.
Also Read
ఒక్కసారి ఛార్జ్‌తో 300+ కిమీ ప్రయాణం.. దుమ్ము రేపుతున్న ఈ-స్కూటర్
Viral Photo: మీకో సవాల్.! ఈ ఫోటోలో చిరుతను కనిపెట్టండి చూద్దాం.. 99% ఫెయిల్!