AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: మీకో సవాల్.! ఈ ఫోటోలో చిరుతను కనిపెట్టండి చూద్దాం.. 99% ఫెయిల్!

ఇంటర్నెట్ ప్రపంచంలో 'ఫైండ్ ది ఆబ్జెక్ట్' పజిల్స్‌ను నెటిజన్లు తెగ ఇష్టపడతారు. వాటిల్లో ఏముందో కనిపెట్టేందుకు ఉత్సాహం...

Viral Photo: మీకో సవాల్.! ఈ ఫోటోలో చిరుతను కనిపెట్టండి చూద్దాం.. 99% ఫెయిల్!
Leopard
Ravi Kiran
|

Updated on: Mar 02, 2022 | 9:57 AM

Share

ఇంటర్నెట్ ప్రపంచంలో ‘ఫైండ్ ది ఆబ్జెక్ట్’ పజిల్స్‌ను నెటిజన్లు తెగ ఇష్టపడతారు. వాటిల్లో ఏముందో కనిపెట్టేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే ఈ ఫోటో పజిల్స్‌లో ఉన్న జంతువును కనిపెట్టేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ కళ్లల్లో పదునుంటే చిటికెలో కనిపెట్టేయగలరు. ఇలాంటి ఫన్ కంటెంట్ కోసం కొన్ని పేజీలు ప్రత్యేకంగా ఫోటో పజిల్స్ అప్‌లోడ్ చేస్తుంటాయి. సవాళ్లను స్వీకరించేవారికి ఈ పజిల్స్ ఇట్టే టైం గడిచిపోయేలా చేస్తాయి. ఈ వైరల్ ఫోటో పజిల్స్.. మాములు పజిల్‌కు తక్కువేం కాదు.. మేధావులను సైతం బురిడీ కొట్టిస్తాయి. ఇక ఇలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో కోకొల్లలు. ఆ కోవకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న చిత్రంలో మీరు ఒక పర్వతాన్ని చూడవచ్చు. అయితే అక్కడ ఓ జంతువు దాగుంది. అది మీకు కనిపించదు. దాన్ని మీరు గుర్తించాలి. పైన పేర్కొన్న చిత్రంలో ఓ మంచు చిరుత ఎంచక్కా సేద తీరుతోంది. ఆ రాళ్ల మధ్య చిరుత సేద తీరుతుండగా.. రాళ్ల రంగు.. చిరుత చర్మం రంగు ఒకటైపోవడంతో.. దాన్ని గుర్తించడం నెటిజన్లకు కాస్త కష్టమే అని చెప్పాలి. చాలా మంది నెటిజన్లు ఈ ఫోటోలో మంచు చిరుతను కనిపెట్టాలని ప్రయత్నించారు. అయితే చివరికి ఫెయిల్ అయ్యారు. మరి మీరు కూడా ఓసారి ప్రయత్నించండి.

ఇదిలా ఉంటే.. మంచు చిరుతలు అరుదైన జాతికి చెందిన జంతువులు. ఇవి ఎక్కువగా కొండలు, పర్వతాలపై తమ జీవనాన్ని సాగిస్తుంటాయి. వాటికీ నీలం రంగు గొర్రెలు ఇష్టమైన ఆహారం అని చెప్పొచ్చు. అలాగే సాయంత్రం వేళ మంచు చిరుతలు వేటాడుతుంటాయి. అవి ఆ సమయంలోనే చురుగ్గా ఉంటాయి.

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!