Russia Ukraine War: పుతిన్ నెక్ట్స్ టార్గెట్ ఆ దేశమేనా..? సంచనల నిర్ణయం తీసుకున్న రష్యా..
ఉక్రెయినను సునాయాసంగా చేజిక్కించుకుందామనుకున్న రష్యా .. ఇప్పుడు మరో టార్గెట్ దిశగా ముందుకు కదులుతోంది. అగ్రరాజ్యం అమెరికాను టార్గెట్ చేసేందుకు రెడీ అవుతోంది. అంతరిక్ష పరిశోధన కేంద్రంపై..

European Space Port: ఉక్రెయినను సునాయాసంగా చేజిక్కించుకుందామనుకున్న రష్యా .. ఇప్పుడు మరో టార్గెట్ దిశగా ముందుకు కదులుతోంది. అగ్రరాజ్యం అమెరికాను టార్గెట్ చేసేందుకు రెడీ అవుతోంది. అంతరిక్ష పరిశోధన కేంద్రంపై గుత్తాధిపత్యం చేస్తున అమెరికాను దెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థలోని సైంటిస్టులను వెనక్కి తీసుకొస్తోంది. బుధవారం 29 మంది మాస్కోకు చేరుకున్నట్టు ప్రకటన చేసింది రష్యా. అక్కడ మిగిలిన మరో 59 మందిని ఏ క్షణమైనా వెనక్కి రప్పించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న రష్యాపై అమెరికా, యూరప్ దేశాల ఆంక్షల నేపథ్యంలో ఆ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ చీఫ్ మండిపడిన సంగతి తెలిసిందే.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్) నిర్వహణలో సహకారాన్ని ఇవి దెబ్బతీస్తాయని పేర్కొంటూ.. ఆ అంతరిక్ష కేంద్రాన్ని ఎవరు నియంత్రిస్తారు?అని రోస్ కాస్మోస్ సంస్థ డైరెక్టర్ దిమిత్రి రోగోజిన్ ప్రశ్నించారు. దీన్ని భారత్, చైనాలపై పడేయాలనుకుంటున్నారా? అని కూడా హెచ్చరించారు. ఇలాంటి ప్రకటన చేసిన రెండు రోజుల్లోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వెంటనే అక్కడ ఉన్న తమ దేశానికి చెందిన సైంటిస్టులను రప్పించారు.
రష్యా సైంటిస్టుల తిరిగి వస్తే ఏం జరుగుతుంది..
ఐఎస్‌ఎస్ నిర్దేశిత కక్ష్యలో తిరిగేందుకు కావాల్సిన ప్రొపెల్షన్ సిస్టమ్‌ను ఆపరేట్ చేస్తోంది రష్యానే. ఐఎస్‌ఎస్‌లో ముఖ్యంగా రెండు కీలకమైన విభాగాలున్నాయి. ఇందులో ఒకదాన్ని అగ్రదేశ అమెరికా ఆపరేట్ చేస్తోంది. మరొకదాన్ని రష్యా నిర్వహిస్తోంది. ఐఎస్‌ఎస్‌ను నివాసయోగ్యంగా మార్చే పవర్ సిస్టమ్స్‌లను యూఎస్ నిర్వహిస్తోంది. ఇక ఈ అంతరిక్ష నౌక నిర్దేశిత కక్ష్యలో తిరిగే బాధ్యతలను రష్యా చూస్తోంది.
రష్యా చూస్తున్న ఐఎస్‌ఎస్ పూర్తిగా జీరో గ్రావిటీ స్పేస్‌లో ఉండదు.. ఇది కొద్దిగా భూమి గురుత్వాకర్షణనుకు సమీపంలో ఉంటుంది. అలాగే భూమి చుట్టూ తిరుగుతున్న సమయంలో ఇది కొంత శక్తిని కోల్పోతుంది. దాన్ని అలాగే వదిలేస్తే.. అది నేరుగా భూమిపై కూలిపోయే ప్రమాదం ఉంది. దీన్ని నియంత్రించేందుకు రష్యా థ్రస్టర్లను పంపుతుంది. ఇవి ఐఎస్‌ఎస్‌ను నిరంతరం నియంత్రిత కక్ష్యలో తిరిగేలా చేస్తాయి. అలాగే దానికి కావాల్సిన వేగాన్ని కూడా అందిస్తాయి.
ఐఎస్‌ఎస్ నిర్వహణలో రష్యా తమ సహకారాన్ని పూర్తి స్థాయిలో ఉపసంహరించుకుంటే అమెరికాతోపాటు ఇతర దేశాలు దానిని నియంత్రించలేవని రష్యా అంతరిక్ష సంస్థ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి: Summer Health Tips: వేసవిలో ఆ నీరే అమృతం.. కుండ నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
Hair Care Tips: డ్రై హెయిర్‌తో ఆందోళన చెందుతున్నారా? అయితే ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే..