Summer Health Tips: వేసవిలో ఆ నీరే అమృతం.. కుండ నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

Summer Health Tips: వేసవిలో ఆ నీరే అమృతం.. కుండ నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
Matka In Summer Season

శివ..శివా అంటూ చలి వెళ్లిపోయింది.. ఇక సూర్యరావ్ గారు తన ప్రతాపాన్ని చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఆయనగారి రకతో ఎండలు మంట పుట్టిస్తున్నాయ్. ఎండల దంచికొడుతుండటంతో ఏం చేయాలో ప్రజలకి తెలియడం లేదు.

Sanjay Kasula

|

Mar 02, 2022 | 8:44 AM

శివ..శివా అంటూ చలి(winter) వెళ్లిపోయింది.. ఇక సూర్యరావ్ గారు(Summer) తన ప్రతాపాన్ని చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఆయనగారి రకతో ఎండలు మంట పుట్టిస్తున్నాయ్. ఎండల దంచికొడుతుండటంతో ఏం చేయాలో ప్రజలకి తెలియడం లేదు. మరోవైపు పేదవాడి రిఫ్రిజిరేటర్(refrigerator) కుండలకు(Matka) డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు మన జీవితాలలో మమేకమైన వస్తువు మట్టి పాత్రలు. మారిన జీవన శైలీతోపాటు.. మట్టి కుండలను కూడా వాడడం మార్చిపోయారు నేటితరం. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఉగాది రోజు మట్టికుండలో షడ్రుచుల పచ్చడిని చేస్తుంటారు. ఆ తర్వాత అదే కుండను మరో రెండు నెలలు ఉపయోగిస్తుంటారు. అయితే ఫ్రీజ్జులు వచ్చాక.. వీటిని పక్కన పెట్టేశారు. పాతకాలంలో నీళ్ళను ఈ మట్టి కుండలలోనే నీళ్లను తాగేవారు. కానీ ప్రస్తుత కాలంలో స్టీల్, ప్లాస్టిక్ పరికరాలలో వాటర్ తాగుతున్నారు. వీటి వలన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు లేవు.. కానీ.. అనారోగ్య సమస్యలు మాత్రం కలిగే అవకాశాలున్నాయి. మట్టి కుండలో నీళ్ళను తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా మంది మట్టి కుండలో నీళ్లు తాగుతుంటారు. ఇక వేసవి ప్రారంభమైంది. మార్కెట్లో కొన్ని చోట్ల ఈ మట్టి కుండలు లభిస్తున్నాయి. అలాగే.. ఇటీవల కాలంలో మట్టి పాత్రలతోపాటు.. మట్టి గ్లాసులు, మట్టి బాటిల్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఈ మట్టి కుండలలో నీళ్లు తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.

మట్టి కుండలో నీళ్లు తాగడం వలన కలిగే ప్రయోజనాలు..

  1.  చాలా మంది ఇళ్ళలో ఇప్పటికి రిఫ్రిజిరేటర్లు ఉండవు. అలాంటి వారు ఎక్కువగా మట్టి కుండను వాడుతుంటారు. మట్టి కుండలు బాష్పీభవనం సూత్రంపై పనిచేస్తాయి. అంటే ఇవి నీళ్లను ఎప్పుడూ చల్లగా ఉంచుతాయి. బంకమట్టి కుండా పోరస్ అయినందున క్రమంగా నీటిని చల్లబరుస్తుంది.
  2. ఫ్రీజ్ నీరు చల్లగా ఉంటుంది.. కాసేపు బయట పెట్టగానే వేడిగా అవుతాయి. వేసవిలో కుండలోని నీరు తాగాడం వలన ఆరోగ్యానికి మంచిది. అలాగే గొంతుకు సంబంధించిన సమస్యలు రావు. జలుబు, దగ్గు సమస్యలను తగ్గిస్తుంది.
  3. సన్ స్ట్రోక్ ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సమస్య. వేసవికాలంలో చాలా మంది వడదెబ్బకు గురవతుంటారు. మట్టికుండలోని నీటిలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండి.. శరీర గ్లూకోజ్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడతాయి.
  4. శరీరంలో ప్రకృతిలో ఆమ్లమైనది. మట్టి ఆల్కలీన్. అందుకే మట్టి కుండలో ఉండే నీరు తాగడం వలన శరీరానికి ఆమ్ల శాతం అందుతుంది. అలాగే.. పీహెచ్ సమతుల్యతను సృష్టిస్తుంది. కడుపులో యాసిడిటి సమస్యను తగ్గిస్తుంది.
  5.  ప్లాస్టిక్ బాటిల్లోని నీరు తాగడం వలన ఇందులో ఉండే బిస్ ఫినాల్ ఏ, బీపీఎ వంటి రసాయనాలు ఉంటాయి. ఇవి శరీరానికి అనేక విధాలుగా హాని కలిగిస్తాయి. ఇది టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది. దీనినే ఎండోక్రైన్ డిస్ట్రప్టర్ అని అంటారు. అయితే మట్టి కుండలోని నీరు త్రాగటం టెస్టోస్టెరాన్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది.

ఇవి కూడా చదవండి: Russia Ukraine War Live Updates: ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా భీకర దాడులు.. నేడు రెండో విడత చర్చలు

Kishan Reddy: పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లపై సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu