Ukraine Crisis: ఉక్రెయిన్‌‌లో రంకెలేస్తోన్న రష్యా.. కివ్‌లో టీవీ టవర్ పేల్చివేత.. షాకింగ్ దృశ్యాలు

Ukraine Crisis: ఉక్రెయిన్‌‌లో రంకెలేస్తోన్న రష్యా.. కివ్‌లో టీవీ టవర్ పేల్చివేత.. షాకింగ్ దృశ్యాలు
Russia Ukraine War

Russia Ukraine War News: ఉక్రెయన్‌పై క్షిపణులతో రష్యా విరుచుకుపడుతోంది. దేశ రాజధాని కీవ్‌తో పాటు, రెండో పెద్ద నగరమైన ఖార్కివ్‌లో జనావాసాలే లక్ష్యంగా రష్యా దాడులు చేస్తోంది.

Janardhan Veluru

|

Mar 02, 2022 | 12:04 PM

Russia Ukraine War News: ఉక్రెయన్‌పై క్షిపణులతో రష్యా విరుచుకుపడుతోంది. దేశ రాజధాని కీవ్‌తో పాటు, రెండో పెద్ద నగరమైన ఖార్కివ్‌లో జనావాసాలే లక్ష్యంగా రష్యా దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో అమాయక పౌరులు, చిన్నారులు చనిపోతున్నారు. ప్రాణభయంతో లక్షలాది మంది దేశాన్ని వీడుతున్నారు. కీవ్‌లో టీవీ టవర్‌ను రష్యా పేల్చివేసింది. దీంతో ఉక్రెయిన్‌లో టీవీ ప్రసారాలు ఆగిపోయాయి. వార్తలు చూసే పరిస్థితి లేక బయట ఏం జరుగుతోందో తెలియక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. టీవీ టవర్‌ను రష్యా క్షిపణి కూల్చివేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అటు ఆంటనోవ్‌ ఎయిర్‌పోర్ట్‌ వరకు రష్యా సేనలు చేరుకున్నాయి. మారియుపోల్‌ సహా ముఖ్య నగరాల్లో భీకర పోరు కొనసాగుతోంది. 16 మంది చిన్నారులు సహా 352 మంది పౌరులు మృతి చెందారు.

ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు సంబంధించిన మరిన్ని కీలక అంశాలు..

  1. ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌పై రష్యా దాడికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. స్వదేశంలోనూ ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఐతే వారిని ఎక్కడికక్కడ అడ్డుకొని రష్యా బలగాలు అదుపులోకి తీసుకుంటున్నాయి.
  2. రష్యా జనావాసాలపై వాక్యూమ్‌ బాంబులు , క్లస్టర్‌ బాంబులను ప్రయోగిస్తోందని సంచలన ఆరోపణలు చేసింది ఉక్రెయిన్‌ . రష్యా యుద్ద నేరాలకు పాల్పడుతోందని ఆరోపించింది. అయితే ఉక్రెయిన్‌ ఆరోపణలను రష్యా ఖండించింది. తాము వాక్యూమ్‌ బాంబులను వాడడం లేదని స్పష్టం చేసింది.
  3. ఉక్రెయిన్‌కు బ్రిట‌న్ హ్యాండిచ్చింది. ర‌ష్యాకు వ్యతిరేకంగా త‌మ సేన‌ల‌ను రంగంలోకి దింప‌లేమ‌ని బ్రిట‌న్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రక‌టించారు. ఉక్రెయిన్‌లోని ర‌ష్యా సేన‌ల‌తో తాము యుద్ధం చేయ‌లేమ‌ని స్పష్టం చేశారు. సైన్యాన్ని మోహ‌రించ‌డం అనేది కేవ‌లం ఆత్మర‌క్షణ చ‌ర్యేనన్నారు బోరిస్‌.
  4. ప్రాణాలు పోయినా సరే తగ్గేదే లేదు. రష్యాకు తగిన గుణపాఠం చెబుతామంటూ ప్రతిజ్ఞ చేశారు జెలెన్‌స్కీ. యూరోపియన్‌ యూనియన్‌ను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. జెలెన్‌స్కీ ప్రసంగానికి ఈయూ సభ్యులు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
  5. ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్‌ జెలెన్‌స్కీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మాట్లాడారు. రష్యాపై మరిన్ని ఆంక్షలతో పాటు ఉక్రెయిన్‌కు రక్షణ సాయంపై చర్చించారు. వీలైనంత త్వరగా రష్యా దండయాత్రను అడ్డుకోవాలని కోరారు.
  6. రష్యాకు మద్దతుగా బెలారస్‌ కూడా ఉక్రెయిన్‌పై దాడికి సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది. ఐతే ఉక్రెయిన్‌లోకి తమ బలగాలను దింపుతున్నట్టు వస్తున్న వార్తలను ఖండించింది బెలారస్‌. అందులో వాస్తవం లేదని ప్రకటించింది.
  7. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అణ్వాయుధాలతో ప్రపంచాన్ని హెచ్చరిస్తున్న నేపథ్యంలో నాటో కీలక ప్రకటన చేసింది. సభ్య దేశాల అణ్వాయుధాల అప్రమత్తత స్థాయిని పెంచాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. సభ్య దేశాలను రక్షించేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని స్పష్టం చేసింది.
  8. 217 ఏళ్లుగా విదేశీ యుద్ధాల విషయంలో తటస్థ వైఖరి అవలంబిస్తున్న స్విట్జర్లాండ్ మొదటిసారి తన విధానానికి స్వస్తి చెప్పింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఈయూ విధించిన అన్ని ఆంక్షలను అంగీకరించింది. స్విట్జర్‌లాండ్‌లో రష్యన్ల కంపెనీలు, ఆస్తులను స్తంభింపజేయనుంది.
  9. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో భారత ఎంబసీ మూసివేసినట్టు ప్రకటించింది విదేశాంగ శాఖ. దౌత్యసిబ్బందిని మరోచోటికి తరలించామని..కీవ్‌లో భారతీయులెవరూ లేరని తెలిపింది. వీలైనంత త్వరగా ఇండియన్స్‌ను స్వదేశానికి తరలించనున్నట్టు వెల్లడించింది.

Also Read..

Neem Benefits: కరోనా ప్రభావాన్ని తగ్గించే వేప.. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ.. తాజా అధ్యయనంలో వెల్లడి..!

Hyderabad: తగ్గేదెలే.. మరో ఘనత సాధించిన భాగ్యనగరం.. సంపన్నుల జాబితాలో మన ప్లేస్ ఏంటంటే..?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu