- Telugu News Photo Gallery Science photos Bark of Neem tree can protect against coronavirus variants suggests study
Neem Benefits: కరోనా ప్రభావాన్ని తగ్గించే వేప.. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ.. తాజా అధ్యయనంలో వెల్లడి..!
Neem Tree Bark Benefits: కరోనా ప్రభావాన్ని తగ్గించే వేప.. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ.. తాజా అధ్యయనంలో వెల్లడి..! కోవిడ్-19ని వేప బెరడుతో నివారించవచ్చని తాజాగా పరిశోధనలో వెల్లడైంది. కొలరాడో అన్‌స్చుట్జ్ మెడికల్ క్యాంపస్ విశ్వవిద్యాలయం..
Updated on: Nov 23, 2023 | 1:25 PM

Neem Benefits: శతాబ్దాలుగా ఆయుర్వేద చికిత్సలో ఉపయోగిస్తున్న వేప ఇప్పుడు కరోనావైరస్ నుండి కూడా రక్షణను ఇస్తుంది. కోవిడ్-19ని వేప బెరడుతో నివారించవచ్చని తాజాగా పరిశోధనలో వెల్లడైంది. కొలరాడో అన్‌స్చుట్జ్ మెడికల్ క్యాంపస్ విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కోల్‌కతా శాస్త్రవేత్తలు తమ ఇటీవలి పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ నుండి రక్షించడానికి వేప ఎలా సహాయపడుతుందో తెలుసుకోండి.

వేప బెరడులో యాంటీవైరల్ గుణాలు ఉన్నాయని వైరాలజీ జర్నల్‌లో ప్రచురించిన పరిశోధన పేర్కొంది. ఇది కరోనా వైరస్, దాని కొత్త వేరియంట్ నుంచి కూడా రక్షణ పొందవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. భారతదేశంలో వేప శతాబ్దాలుగా యాంటీవైరల్, యాంటీపరాసిటిక్, యాంటీ బాక్టీరియల్‌గా ఉపయోగించబడుతోంది. మలేరియా, చర్మ వ్యాధులు కూడా వేప బెరడు సహాయంతో నయమవుతాయి.

కరోనా వైరస్‌పై వేప ఎంత ప్రభావవంతంగా ఉంటుందో తెలుసుకోవడానికి పరిశోధన జరిగింది. పరిశోధన సమయంలో కరోనా వైరస్ సోకిన ఊపిరితిత్తుల కణాలపై వేప బెరడు సారం ఉపయోగించారు. దీంతో వేప వల్ల వైరస్ రెప్లికేషన్ తగ్గుముఖం పట్టిందని.. దీంతోపాటు దాని ఇన్‌ఫెక్షన్ వేగం కూడా తగ్గిందని వెల్లడైంది.

తదుపరి దశ పరిశోధనలో వైరస్ ప్రభావాన్ని నియంత్రించే వేప బెరడులో ఏ మూలకం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తామని పరిశోధకులు చెబుతున్నారు. అయితే వేప ప్రభావం వైరస్‌పై ఉంటుందని మాత్రం స్పష్టమైనట్లు పరిశోధకులు వెల్లడించారు.

బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం.. కొత్త యాంటీవైరల్ థెరపీతో ప్రస్తుత మహమ్మారిని ఎదుర్కొవచ్చని పరిశోధన ఫలితాలు చూపిస్తున్నాయని పరిశోధకులు అంటున్నారు. కరోనా వేరియంట్ల విషయంలో కూడా ఇది ప్రభావవంతంగా ఉంటుందని నిరూపించవచ్చని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.




