Hyderabad: తగ్గేదెలే.. మరో ఘనత సాధించిన భాగ్యనగరం.. సంపన్నుల జాబితాలో మన ప్లేస్ ఏంటంటే..?
UHNWI India: తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరో ఘనత సాధించింది. యావత్ దేశంలోనే సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ఎందులో, ఏమిటో ఇప్పుడు చూద్దాం.
UHNWI India: తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరో ఘనత సాధించింది. యావత్ దేశంలోనే సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ఎందులో, ఏమిటో ఇప్పుడు చూద్దాం. మన హైదరాబాద్ మహానగరం అభివృద్ధిలో దూసుకెళ్తూ మరో ఘనతను సొంతం చేసుకుంది. దేశంలోనే అత్యంత ధనవంతులున్న నగరాల్లో రెండో స్థానంలో నిలిచింది భాగ్యనగరం. నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్-2022 ప్రకారం ఈ ఫీట్‌ను సాధించింది. అత్యంత ధనికులున్న నగరాల్లో ముంబై (Mumbai) ఫస్ట్ ప్లేస్‌లో నిలిస్తే, హైదరాబాద్ (Hyderabad) సెకండ్ ప్లేస్ దక్కించుకుంది. 227కోట్ల రూపాయలు కంటే ఎక్కువ నికర ఆస్తి ఉన్నవారిని అత్యంత ధనికులుగా పరిగణలోకి తీసుకుంటారు. ఈ లెక్కన ముంబైలో 1596 మంది ఉంటే, హైదరాబాద్‌లో 467మంది ఉన్నట్లు నైట్ ఫ్రాంక్ వెల్త్ (Knight Frank) తెలిపింది.
2026 నాటికి హైదరాబాద్‌లో అత్యంత ధనవంతుల సంఖ్య 728కి పెరుగుతుందని అంచనా వేసింది. ఐదేళ్లలో హైదరాబాద్‌లో అత్యంత ధనికుల సంఖ్య 48.7శాతం పెరిగినట్లు తెలిపింది. అంటే, ఐదేళ్ల క్రితం భాగ్యనగరంలో 314మంది భాగ్యవంతులు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 467కి పెరిగింది. ఇక, దేశవ్యాప్తంగా చూస్తే ఒక్క ఏడాదిలోనే 11శాతం వృద్ధి నమోదైంది. 2020లో 12వేల 287మంది బిలియనీర్స్ ఉంటే, 2021లో 13వేల 637కి పెరిగింది.
నైట్ ఫ్రాంక్ వెల్త్ సంస్థ అంచనాల ప్రకారం 2026 నాటికి భారత్‌లో బిగ్ బిలియనీర్స్ సంఖ్య 19వేలు దాటుతుందని తెలిపింది. ధనవంతులంతా తమ పెట్టుబడులను స్థిరాస్తిల్లో పెడుతున్నట్లు వెల్లడించింది. స్టాక్ మార్కెట్లు ఊహించనివిధంగా రాణించడం, డిజిటల్ టెక్నాలజీ విస్తరణతోనే భారత్‌లో ధనికుల సంఖ్య పెరుగుతోందని నైట్ ఫ్రాంక్ వెల్త్ సంస్థ వెల్లడించింది.
Also Read: