Maharastra: ఆలయంలో వింత సంఘటన.. భక్తులను ఆశీర్వదిస్తున్న శునకం.. భగవంతుని లీల అద్భుతం అంటూ వీడియో వైరల్

Temple in Maharastra: ప్రకృతిలోని ప్రతి జీవిలోనూ దైవాన్ని చూడమని చెప్పింది భారతీయ(Bharath) సనాతన హిందూ(Hindu Dharma) ధర్మం. అందుకనే దేవుళ్ళనే కాదు.. మానవుడైన రాముడిని, పశుపక్షులను కూడా దైవంగా

Maharastra: ఆలయంలో వింత సంఘటన.. భక్తులను ఆశీర్వదిస్తున్న శునకం.. భగవంతుని లీల అద్భుతం అంటూ వీడియో వైరల్
Viral Video
Follow us

|

Updated on: Mar 02, 2022 | 1:31 PM

Temple in Maharastra: ప్రకృతిలోని ప్రతి జీవిలోనూ దైవాన్ని చూడమని చెప్పింది భారతీయ(Bharath) సనాతన హిందూ(Hindu Dharma) ధర్మం. అందుకనే దేవుళ్ళనే కాదు.. మానవుడైన రాముడిని, పశుపక్షులను కూడా దైవంగా భావించి గౌరవించి.. పూజిస్తాం.. ప్రకృతిని దేవతగా భావించి ఆరాధిస్తారు. అందుకే మన దేశంలో ఆలయాలు..హిందువులకు పండుగలు, పర్వదినాలు  చాలా ఎక్కువ. ఆవుల్ని గోమాతగా పూజిస్తాం. వరాహం, నెమలి, ఒంటె, పులి, సింహం, సర్పం..ఇలా ప్రతి జీవి భారతీయుల దృష్టిలో పరమాత్మ అంశలే. అందుకే భారతీయ సంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ క్రమంలో మన గుళ్లు, పవిత్ర ప్రార్థనా స్థలాల దగ్గర అప్పుడప్పుడూ మూగజీవాలు కూడా దర్శనమిస్తూ ఉంటాయి. తాజాగా సోషల్‌ మీడియాలో ఒక వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో ఒక కుక్క ఒక ఆలయ ద్వారం దగ్గర ఎత్తయిన అరుగుపైన కూర్చుని ఉంది. గుడిలోకి వెళ్లి దైవదర్శనానికి వచ్చిన భక్తులను ఆశీర్వదిస్తుంది. వారికి షేక్‌హ్యాండ్‌ ఇచ్చి పలకరిస్తోంది. ఈ శునకం అరుగుపైన కూర్చుని తన ముందు కాళ్లలో ఒకదానిని పైకి లేపి భక్తుల తలపై ఉంచి దీవిస్తోంది. ఇది చూస్తుంటే నిజంగా అది ఆశీర్వాదం ఇస్తున్నట్లే అనిపిస్తోంది. కొందరు దానితో కరచాలనం చేసినప్పుడు అది కూడా తన కాలును చాచి షేక్ ఫీట్ ఇస్తోంది.

View this post on Instagram

A post shared by SMALL-TO-BIGTAILS? (@smalltobigtails)

ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఓ రిపోర్ట్ ప్రకారం ఈ వీడియో మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో ఉన్న సిద్ధివినాయక దేవాలయంలో జరిగిన సంఘటనగా తెలుస్తోంది. ఒక వ్యక్తి తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశాడు. దాంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. కుక్కను చూసి జనాలు కాస్త భయపడినా… చాలా మంది దాని ముందు తలవంచుకుని దేవుడి స్వరూపుడంటూ నమస్కరిస్తున్నారు. కుక్క కూడా ఇలాగే ప్రజలను ఆశీర్వదిస్తూ ఎంతో ప్రేమగా అందరితో కరచాలనం చేస్తోంది. ఎవరికీ హాని కలిగించడంలేదు. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు కుక్కపై ప్రేమను కురిపించారు. “అది గణపతి బప్పా ద్వారపాలకుడు” అని ఒకరు అంటే . “కుక్కలు చాలా అందమైనవి, మనం వాటికి విలువ ఇవ్వాలి” అని మరో యూజర్ స్పందించారు. ఇంకొకరు “కుక్కను దేవదూతగా చేసిన భగవంతుని లీల అద్భుతం” అని అన్నారు.

Also Read:

లైకులు వస్తాయనుకున్నాడు.. షర్ట్ పైకి ఎగరేశాడు.. కట్ చేస్తే దిమ్మతిరిగే షాక్!