AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో గెలుపు ఎవరిది..? ముందే చెప్పేసిన బాబా వెంగా..

బల్గేరియాకు చెందిన బాబా వెంగా 2022లో ఏం జరుగుతుందో ముందే చెప్పేశారు. ఆమె చెప్పిన చాలా విషయాలు ఇప్పటివరకు చాలాసార్లు నిజమయ్యాయి.

Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో గెలుపు ఎవరిది..? ముందే చెప్పేసిన బాబా వెంగా..
Baba Vanga
Sanjay Kasula
| Edited By: |

Updated on: Mar 02, 2022 | 3:14 PM

Share

Russia Ukraine War: ఏం జరుగబోతోంది ? ప్రపంచం అల్లకల్లోలంగా మారుతుందా ? ప్రపంచవ్యాప్తంగా విధ్వంసాలు ముంచుకొస్తాయా..? రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో ఏం జరుగుతుందోనన్న విషయంపై చాలా మంది చాలా రకాలుగా ఊహించుకుంటారు. కాని బల్గేరియాకు చెందిన బాబా వెంగా(Baba Vanga) 2022లో ఏం జరుగుతుందో ముందే చెప్పేశారు. ఆమె చెప్పిన చాలా విషయాలు ఇప్పటివరకు చాలాసార్లు నిజమయ్యాయి. బల్గేరియా ప్రజలు ఆమెను దైవదూతగా భావిస్తారు. ఖచ్చితంగా బాబా వెంగా చెప్పిందే నిజమవుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. బాబా వెంగా చాలా ఉపద్రవాలు ముంచుకొస్తాయని ఏనాడో ఊహించారు. గతంతో పోలిస్తే రష్యా- ఉక్రెయిన్ వార్‌లో ఏం జరగనుందో బాబా వెంగా ఆనాడే చెప్పారట. బాబా వెంగా 1996 లోనే చనిపోయారు. కాని భవిష్యత్‌ లో ఏం జరుగబోతుందన్న విషయంపై ఆమె శిష్యులకు చెప్పారు. బాబా వెంగా భవిష్యవాణి ఇప్పటికి పుస్తకరూపంలో ఉంది. ఇది చాలాసార్లు నిజమవుతోంది. 12 ఏళ్ల వయస్సు లోనే బాబా వెంగా తన కంటిచూపును కోల్పోయారు. కాని కంటి చూపు లేనప్పటికి తన ముందు నిల్చున్న వ్యక్తి జాతకాన్ని చాలా సులభంగా చెప్పేసేవారు. అందుకే బాల్కన్‌ దేశాల్లో ఆమెను దేవతగా ఆరాధిస్తారు.

అమెరికాపై సెప్టెంబర్‌ ఎలెవన్‌ దాడులను బాబా వెంగా ముందే ఊహించారు. అల్‌ఖైదా(Al Qaeda) ట్విన్‌ టవర్స్‌పై దాడి చేస్తుందని ఆమె చెప్పిన మాట ముమ్మాటికి నిజమయ్యింది. బ్రెగ్జిట్‌ విషయంలో కూడా ఆమె చెప్పిదే కరెక్టయ్యింది. యూరోపియన్‌ యూనియన్‌ విచ్చిన్నం అవుతుందని ఆమె చెప్పారు. నమ్మరుకాని ఆమె చెప్పిన జ్యోతిష్యంలో 85 శాతం నిజమయ్యాయి.

గతంలో కూడా రష్యా అధ్యక్షుడు స్టాలిన్‌ చనిపోతాడని ముందే ఊహించారు బాబా వెంగా. స్టాలిన్‌ విషయంలో ఆమె చెప్పిందే కరెక్టయ్యింది. అంతేకాదు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ భవితవ్యంపై కూడా చాలా సంచలన విషయాలు వెల్లడించారు తన భవిష్యవాణిలో బాబా వెంగా.

అయితే, తాజాగా ఉక్రెయిన్ పౌరులు రష్యా దాడి నుంచి బయటపడుతున్నారు. ఈ మ‌ధ్య వెంగ‌బాబా ఫ్యూచ‌ర్ అంద‌రినీ షాక్‌కి గురి చేసింది. గతంలో ఎన్నో అంతర్జాతీయ పరిణామాలను అంచనా వేసిన బాబా వెంగా ఇప్పుడు యుద్ధంలో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడుతారో అంచనా వేశారు.

బాబా వెంగా భవిష్యత్తు ప్రకారం, ఉక్రెయిన్‌లో యుద్ధం తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరింత బలపడతారు. సమీప భవిష్యత్తులో రష్యా ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. భవిష్యత్తులో రష్యా ప్రపంచానికి రాజు అవుతుంది. కానీ యూరప్ మాత్రం ఒక బంజరు భూమిగా మారుతుంది. అంతా మంచులా కరిగిపోతుంది. వ్లాదిమిర్ పుతిన్ వైభవాన్ని, రష్యన్ వైభవాన్ని ఎవరూ తాకలేరు. రష్యాను ఎవరూ ఆపలేరు. రష్యా తన దారి నుంచి అందరినీ అడ్డు తొలిగించుకుని ప్రపంచాన్ని శాసిస్తుందని ఆమె తన భవిష్యవాణిలో చెప్పారట.

ఈ బాబా వెంగా ఎవరు?

బాబా వెంగా అసలు పేరు వంగేలియా పాండేవా గుష్టెరోవా. 1911లో బల్గేరియాలో జన్మించిన ఆమె 12 ఏళ్ల వయసులో తుపానులో కన్ను కోల్పోయారు. కానీ ప్రపంచాన్ని అంచనా వేయగల శక్తి వారికి ఉందని బల్గేరియా వాసులు నమ్ముతారు. బాబా వెంగా కూడా ఇలాంటి మాటలు చెప్పారు. బాబా వెంగా 1996లో మరణించినప్పుడు, ఆమె వయస్సు 85 సంవత్సరాలు. ఇంతలో,  చాలా సంవత్సరాలు ప్రపంచంలో ఏమి జరుగుతుందో అంచనా వేసినట్లు చెబుతారు.  చార్నోబిల్ దుర్ఘటన, యువరాణి డయానా మరణంతో సహా ఆమె చెప్పిన పలు సంఘటనలు మొత్తం 85 శాతం నిజమ అవుతున్నాయంటున్నారు. 

ఇవి కూడా చదవండి: Summer Health Tips: వేసవిలో ఆ నీరే అమృతం.. కుండ నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

Hair Care Tips: డ్రై హెయిర్‌తో ఆందోళన చెందుతున్నారా? అయితే ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే..